ప్రపంచ శృంగార నాయిక ఫాక్స్
లండన్ : ప్రపంచ శృంగార నాయికగా 'ట్రాన్స్ ఫార్మర్స్' నటి మెగాన్ ఫాక్స్ ఎంపికైంది. 2009 సంవత్సరానికి గాను ప్రపంచంలోని 100 మంది శృంగార నాయికల్లో ఫాక్స్ అగ్రస్థానాన్ని సాధించింది. ప్రముఖ పురుషుల మ్యాగజైన్ 'ఎఫ్ హెచ్ఎం' ఈ పోలింగ్ నిర్వహించింది. విశ్వవ్యాప్తంగా 97 లక్షల మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఫాక్స్ 'ప్రపంచ శృంగార నాయిక'గా అగ్రస్థానం అందుకోవడం ఇది వరుసగా రెండోసారి. గతంలో జెన్నిఫర్ లొపేజ్ 2001, 2002 సంవత్సరాల్లో ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ఫాక్స్ కు ఓటేసిన వారిలో అత్యధికులు బ్రిటిన్ వాసులే. మెగాన్ ఫాక్స్ తరువాత జెస్సికా అల్బా రెండో స్థానం కైవసం చేసుకుంది. స్కార్లెట్ జోహాన్సన్ తృతీయ స్థానం దక్కించుకుంది. జెస్సికా బెహల్, మెడలైన్ జిమా నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. అడ్రిన లిమా, ఎలిషా కత్ బెరడ్, హైడి మాంటాగ్, అన్నె హాత్ఎవే, కటీ పెర్రీలు ఆ తదుపరి స్థానాలు (ఆరు నుంచి పది) సొంతం చేసుకున్నారు. ఏంజెలినా జోలీ 14, జెన్నిఫర్ అనిస్టన్ 50వ ర్యాంక్ లో ఉండగా, గత ఏడాది 100వ స్థానంలో ఉన్న బ్రిట్నీ స్పియర్స్ ఈ ఏడాది 12వ స్థానంలోకి వచ్చారు.
News Posted: 24 June, 2009
|