ఒబామాతో షారూక్!
అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కింగ్ ఖాన్ షారూక్ వెండితెరపై కనిపించి అలరించబోతున్నారు. ఇదెలా సాధ్యమైంది? ఒబామా ఇందుకు ఒప్పుకున్నారా? అనే ఉత్సుకత సహజం. మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదులెండి. షారూక్ తో స్క్రీన్ పంచుకోబోయేది ఒబామా కాదు కానీ...ఒబామాను పోలిన వ్యక్తి. షారూక్ కథానాయకుడుగా కరణ్ జోహర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రంలో ఈ కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని మరికొన్ని కీలక ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది.
షారూక్, ఒబామా ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది, అసలు ఈ చిత్ర కథ ఏమిటనేది సస్పెన్స్ లోనే ఉంచారు. అయితే కథలో ఈ సన్నివేశాలు కీలకమైనందున ఒబామాతో దగ్గర పోలికలున్న ఆఫ్రికన్ అమెరికన్ ను అన్వేషించే బాధ్యతను కరణ్ జోహర్ ఓ కాస్టింగ్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ చిత్రంలో షారూక్ కు జోడిగా తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ కాజల్ నటిస్తుండటం విశేషం. ఒకప్పటి హిట్ పెయిర్ అయిన ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తుండటం, ఒబామా వెండితెరపై ప్రత్యక్ష్యం కానుండటం వంటివి చూస్తే ఈ ఏడాది విడుదల కానున్న చిత్రాల్లో 'మై నేమ్ ఈజ్ ఖాన్' ఎక్కువ క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం.
News Posted: 24 June, 2009
|