అక్షయ్ గ్రేట్ కిస్సర్: డెనీస్
బాలీవుడ్ 'కిలాడీ' అక్షయ్ కుమార్ ను 'సెక్సీయెస్ట్ మాన్ ఇన్ ఇండియా'గా అనుకోవచ్చా? నిజం చెప్పాలంటే అంతర్జాతీయంగా జరిగిన సర్వేలు జాన్ అబ్రహంకే పట్టం కడుతూ వచ్చాయి. సల్మాన్ ఖాన్ కూడా ఆ వెనకే ఉన్నారు. అయితే మాజీ బాండ్ గాళ్, హాలీవుడ్ హాటెస్ట్ సుందరి డెనీస్ రిచర్డ్స్ మాత్రం కొంచెం భిన్నంగానే అక్షయ్ పై తన అభిప్రాయాన్ని చెబుతోంది. అక్షయ్ కు 'గ్రేట్ కిస్సర్' (ముద్దుల్లో ఘనాపాఠి) అంటూ కితాబిచ్చేసింది. అక్షస్మాత్తుగా డెనీస్ ఇలాంటి నిశ్చితాభిప్రాయానికి ఎలా వచ్చింది? సాజిద్ నడియడ్ వాలా నిర్దేశకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'కంభఖ్త్ ఇష్క్' చిత్రంలో అక్షయ్ తో 'లిప్ 2 లిప్ కిస్' ఘట్టంలో పాల్గొన్న అనుభవమే ఇందుకు కారణం. సినిమాలో ఈ ఘాటు ముద్దు సన్నివేశం రెండు నిమిషాల నిడివితో ఉండబోతోంది. ఇండియన్ సెన్సార్ బోర్డు ఆమోద ముద్ర వేసిన ఈ ముద్దు సన్నివేశం అత్యంత సమ్మోహనంగా ఉంటుందని డెనీస్ ఊరిస్తోంది.
అక్షయ్ తో కలిసి పాల్గొన్న కిస్సింగ్ సెషన్స్ ను డెనీస్ ఎంతగానో ఎంజాయ్ చేయడంతో పాటు ముద్దులివ్వడంలో అక్షయ్ చూపించిన టెక్నిక్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయని కూడా చెబుతోంది. అక్షయ్ తో మినహా భారీతీయనటులెవరిలోనూ ముద్దు అనుభవం లేని డెనీస్ హాలీవుడ్ లో మాత్రం మంచి నెరాజాణే. పియర్స్ బ్రాస్నన్ తో సహా అనేక మంది స్టార్ హీరోలతో రొమాంటిక్ సీన్స్ ను రక్తికట్టించిన అనుభవం ఆమెది. 'అక్షయ్ ఎంతో నిబద్ధత ఉన్న నటుడు. ఆయన సహచర్యంలో ఎంతో కంఫర్టబుల్ గా ఉండగలిగాను. అదనంగా..ఆయనో మంచి కిస్సర్. ఇండియాలో సెక్సియస్ట్ యాక్టర్ గా ఆయన ఎందుకనిపించుకుంటున్నారో నేను గ్రహించగలిగాను' అంటూ నవ్వుతూ చెప్పింది డెనీస్. బాలీవుడ్ సినిమాలో నటించడం కొత్త కావడం వల్ల తనకు భాషతో సమస్య ఏర్పడినా అక్షయ్, ఇతర నటీనటులు తనకెంతో సహకరించారనీ, వారెంతటి సహృదయులో చెప్పనలవి కాదనీ పొగడ్తలతో ముంచెత్తింది. 'కంభఖ్త్ ఇష్క్' చిత్రంలో స్విల్వస్టర్ స్టాలోన్, బ్రాండన్ రూత్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు సైతం నటించారు. ఇక అక్షయ్ సైతం ఈ చిత్రంలో తనకు జోడిగా నటించిన బాలీవుడ్ నెంబర్ వన్ నటి కరీనాకపూర్ తోనూ 'లిప్ లాక్' సన్నివేశాలు సునాయాసంగా లాగించేవారు. కరీనా, డెనీస్ లో ఎవరు బెటర్ కిస్సర్ అని 'కిలాడీ' బాబు అక్షయ్ ను తమాషా గా ప్రశ్నిస్తే 'ఆ ముద్దు ముచ్చట్ల గురించి నాకేం తెలియదు' అంటూ చేతులెత్తేసారు. దటీజ్ అక్కీ....
News Posted: 25 June, 2009
|