'లిప్ లాక్స్' 10కి పైమాటే..!
బాలీవుడ్ లో ఇప్పుడు ఏ నలుగురు కలిసినా 'కంభఖ్త్ ఇష్క్' గురించిన ముద్దు ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సాజిద్ నడియల్ వాలా నిర్దేశకత్వంలో అక్షయ్, కరీనాకపూర్, హాలీవుడ్ స్టార్స్ డెనిస్ రిచర్డ్స్, సిల్వస్టర్ స్టాలోన్, బ్రాండన్ రూత్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అక్షయ్ ఇండియాలోనే సెక్యీయస్ట్ యాక్టర్ అనీ, గ్రేట్ కిస్సర్ అనీ డెనిస్ రిచర్డ్స్ ఇప్పటికే అక్షయ్ ని ఆకాశానికి ఎత్తేసింది. అక్షయ్, డెనీస్ మధ్య రెండు నిమిషాల పాటు ఈ 'లిప్ 2 లిప్ కిస్' సన్నివేశం తెరపై బ్లో-యప్ చేసి చూపించబోతున్నారు. ఇక ప్రధాన హీరోయిన్ అయిన కరీనాతోనో అధరామృతాలను జుర్రుకునే సన్నివేశాల్లోనూ అక్షయ్ జీవించేశారట. ఈ ఘాటుముద్దుల వ్యవహారంపై అక్షయ్, కరీనా మాత్రం ఇంకా పెదవి విప్పడం లేదు. తన ప్రియుడు సైఫ్ అలీకి కోపం వస్తుందేమోనని కరీనా, సైఫ్ ను ఇబ్బందిపెట్టడం బాగోదని అక్షయ్ మిన్నకుంటున్నారట. అయితే సినిమా రిలీజ్ దగ్గర్లోనే ఉండటంతో ఒక్కో విశేషం క్రమంగా వెలుగుచూస్తోంది.
బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో కరీనా-అక్షయ్ మధ్య రొమాంటిక్ లవ్ సన్నివేశాలతో పాటు, పదికి తక్కువ కాకుండా 'లిప్ లాక్' సన్నివేశాలు ఉన్నాయట. వీటిలో రెండు ముద్దు ఘట్టాలు క్లైమాక్స్ కు ముందు ఉంటాయట. కరీనా-అక్షయ్ ల ముద్దు కెమెస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతోందని సాజిద్ ను అడిగితే 'సినిమాలో లెక్కక మించిన ముద్దులు గుప్పించినట్టు నా నోటితో ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు? ఆడియెన్స్ ను సినిమా చూసి తెలుసుకోనివ్వండి' అంటూ ఆయన నవ్వేశారు.
News Posted: 25 June, 2009
|