స్పీడ్ పెంచిన అక్షయ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'ఖంభక్త్ ఇష్క్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 3న విడుదలకు సిద్ధమవుతోంది. అక్షయ్, కరీనా, హాలీవుడ్ స్టార్స్ డెనీస్ రిచర్డ్స్, బ్రాండన్ రూత్, సిల్వస్టర్ స్టాలోన్ వంటి భారీ స్టార్ కాస్ట్ నటించడం కూడా ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఇటీవల కాలంలో కొన్ని ఫ్లాపులు చవిచూసిన అక్షయ్ ఈ చిత్రంతో తనకు మళ్లీ పూర్వ వైభవం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. తన హవా మునుముందు కూడా కొనసాగించేందుకు వరుస సినిమాలకు ఎడాపెడా అగ్రిమెంట్లు చేస్తున్నారు. ఇందులో కొన్నింటిని ఆయన తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు కూడా.
పరిశ్రమలో తనకు పెద్ద హిట్లిచ్చిన దర్శకులు, బ్యానర్లనే మళ్లీ అక్షయ్ ఎంచుకుంటున్నారు. ఆ ప్రకారమే పలువురు డైరెక్టర్లతో సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. గతంలో తనకు పలు హిట్లు ఇచ్చిన ప్రియదర్శనతో అక్షయ్ తాజాగా 'ఖట్టా మీటా' అనే ఓ కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. దీనికి అక్షయ్ నిర్మాత కాగా, దక్షిణాది ప్రముఖ నటి త్రిష ఈ చిత్రంలో అక్షయ్ కు జోడిగా ఎంపికై బాలీవుడ్ లోకి తొలిసారి అడుగుపెడుతోంది. అక్షయ్ నటించిన 'చాంద్నీ చౌక్ టు చైనా' చిత్రం ఫ్లాప్ అయినా, ఆ చిత్ర దర్శకుడు నికిల్ అద్వానితో మరో చిత్రానికి కూడా అక్షయ్ ఇప్పుడు కమిట్ అయ్యారు. అది కూడా సొంత బ్యానర్ లోనే ఉండబోతోంది. నిఖిల్ ఇప్పటికే అక్షయ్ తో 'పాటియాలా హౌస్' అనే చిత్రానికి పనిచేయబోతున్నాయి. 'చాంద్నీ చౌక్ టు చైనా' నిర్మాతలే ఈ చిత్రాన్ని తీస్తున్నారు. వీటికి తోడు అక్షయ్ మరో చిత్రాన్ని అనీస్ బజ్మీ ('సింగ్ ఈజ్ కింగ్' ఫేమ్) డైరెక్షన్ లో చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అక్షయ్ తీరికలేనంతగా వరుస సినిమాలకు కమిట్ అవుతుండటం స్టార్ హీరోల గుండెల్లో గుబులు రేపుతోంది...
News Posted: 27 June, 2009
|