ఐనాక్స్ 'మార్నింగ్ వాక్'
ఐనాక్స్ మల్టీప్లెక్స్ కు చెందిన ఐనాక్స్ మోహషన్ పిక్చర్స్ తొలిసారిగా చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా హిందీలో 'మార్నింగ్ వాక్' అనే చిత్రాన్ని రూపొందిస్తోంది. ఐనాక్స్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో తపన్ బిస్వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరూప్ దత్తా దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ్ ఖేర్, షర్మిలా ఠాగూర్, రజిత్ కపూర్, దివ్యాదత్, షాయన్ మున్సీ, నర్గిస్, అవికా ఘర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
పక్కపక్కన నివసించే రెండు విభిన్నమైన కుటుంబాల మద్య చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. జాయ్ మోహన్ (అనుపమ్ ఖేర్) ఒకరోజు మార్నింగ్ వాక్ కు వెళ్లినప్పుడు గుండెపోటు వస్తుంది. ఆ రోజు అతన బర్త్ డే కూడా. ఆ సంఘటన అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఇక నుంచి తన కుటుంబ సభ్యులైన కుమారుడు (రజత్ కపూర్), కోడలు (దివ్యాదత్తా), మనుమరాలు(అవిక) కు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే ఒకప్పటి తన స్టూడెంట్, మిత్రురాలు నీలిమ (షర్మిలా ఠాగూర్)ను కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? మార్గింగ్ వాక్ లో జరిగిన సంఘటన రెండు కుటుంబాల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చిందనేది చాలా హృద్యంగా ఉంటుందని ఐనాక్స్ మోషన్ పిక్చర్స్ ప్రతినిధి తెలిపారు. ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది.
News Posted: 29 June, 2009
|