గెస్ట్ లెక్చరర్ కు టబు 'నో'
వెండితెరపై పేజీలకు పేజీలు డైలాగ్ లు చెప్పడం వేరు..నిజజీవితంలో తడుముకోకుండా ఉపన్యసించడం వేరు. విలక్షణ నటి టబూ ఈ విషయాన్ని గ్రహించినట్టే ఉంది. 'చాందినీ బార్', 'అస్తిత్వ' వంటి పలు చిత్రాలు టబూ నటనా ప్రతిభకు అద్దం పడతాడు. విలక్షణ పాత్రల పోషణలో ఎప్పుడూ ముందుడే టబూ తాజాగా 'గెస్ట్ లెక్చరర్'గా వచ్చిన ఓ ఆఫర్ ను మాత్రం తోసిపుచ్చింది. న్యూజెర్సీకి చెందిన ఒక యూనివర్శిటీ పాఠ్యాంశాల్లో ఫిల్మ్ మేకింగ్ కు చెందిన అంశాలు కూడా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే భారతీయ సినిమాలపై తన అనుభవాలను వివరించేందుకు గెస్ట్ లెక్టరర్ గా రావాల్సిందిగా టబూను ఆ యూనివర్శిటీ ఇటీవల కోరింది.
ఈ ఆఫర్ ను ఒప్పుకునే విషయంలో టబూ ఎటూ తేల్చుకోలేక తన మిత్రులు, శ్రేయోభిలాషులను సంప్రదించిందట. చివరకు గెస్ట్ లెక్చరర్ గా పాల్గొనకపోవడమే మేలని నిశ్చయించుకుందట. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయట. పబ్లిక్ లో అనర్ఘళంగా ఉపన్యసించ గలిగే టాలెంట్ అంతగా లేకపోవడం మొదటిదైతే, విద్యార్థులు తనను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోననే ఆలోచన రెండవది. లేని గొప్పలకు పోయేకంటే నిజాయితీగా తమకున్న టాలెంట్ ను తెలుసుకుని సైలైంట్ గా ఉండాలనుకున్న టబూను మెచ్చుకోవాల్సిందే.
News Posted: 1 July, 2009
|