యోగాతో శ్రియ వండర్స్
యోగాతో మనసు ఎంతో తేలికవుతుందనీ, దేహానికి అవసరమైన శక్తి అందుతుందనీ అందాల నటి శ్రియ తన యోగానుభవాన్ని చెబుతోంది. ఇటీవలే హిమాలయాలకు వెళ్లి వచ్చిన శ్రియ ఇప్పుడు క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన 'యోగా-మెడిటేషన్' వర్క్ షాప్ లో కూడా ఆమె పాల్గొంది.
'కోయంబత్తూరులోని ఓ ప్రముఖ యోగా గురువు ద్వారా ఈ వర్క్ షాప్ గురించి తెలిసింది. దీంతో ఒక ప్రొఫెషనల్ తరహాలోనే యోగా నేర్చుకోవాలని నిశ్చయించుకుని ఆ వర్క్ షాప్ లో పాల్గొన్నాను' అని శ్రియ తెలిపింది. తన యోగానుభవాన్ని వివరిస్తూ, యోగా ద్వారా అద్భుతమైన అనుభూతిని పొందాననీ, ఒక అతనతో పాటు ఆ క్యాంప్ లో చాలామందే పాల్గొన్నారనీ చెప్పింది. అటవీ పాత్రం మధ్యలో ఈ వర్క్ షాప్ జరిగిందనీ, తాను ఉదయమే లేచి అన్ని రకాల ఆసనానాలను ప్రాక్టీస్ చేసేదాన్ననీ చెప్పుకొచ్చింది. యోగా, ధాన్యం వల్ల కెరీర్ ను ఎంతో ఉత్సాహంగా కొనసాగించగలుగుతాననే బలమైన నమ్మకం ఏర్పడిందనీ, ముఖ్యంగా పలు రకాల టెన్సన్ల నుంచి విముక్తి పొందడానికి యోగా బాగా ఉపయోగపడుతుందనీ చెప్పింది. అనుష్క, భూమిక, శిల్లాశెట్టి తదితరులు ఇప్పటికే సందర్భం వచ్చినప్పుడల్లా యోగా గొప్పతనాన్ని చెబుతూ ఉండటం అందరికీ తెలిసిన విషయం. శిల్పా అయితే తాను స్వయంగా యోగాసనాలు వేసిన ఓ డీవీడీని మార్కెట్ లోకి కూడా రిలీజ్ చేశారు. శ్రియ సైతం ఇప్పుడు ప్రొఫెషనల్ గా యోగాను అభ్యసించడం ద్వారా కెరీర్ పరంగా వండర్స్ సృష్టిస్తుందేమో చూడాలి.
News Posted: 2 July, 2009
|