షైనీ కస్టడీ పొడిగింపు
ముంబై: సొంత ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేసిన అభియోగాన్ని ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 16 వరకూ ముంబై హైకోర్టు పొడిగించింది. పధ్నాలుగు రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్న షైనీని గురువారం మధ్యాహ్నం కోర్టు ముందు హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆర్దూర్ రోడ్ జైలులో షైనీ ఉంటున్నారు.
జూన్ 14న తనపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షైనీని అరెస్టు చేశారు. పనిమనిషితో లైంగిక కార్యక్రమంలో షైనీ పాల్గొన్నాడంటూ గత వారం పోలీసులకు అందిన డిఎన్ఎ నివేదిక కూడా ధ్రువీకరించించింది. తాగుడు మైకంలో తాను ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చని షైనీ క్లయిమ్ చేయడంతో అతని బ్లడ్ సాంపుల్స్ ను కూడా సేకరించారు. అయితే సంఘటన జరిగిన సమయంలో అతను పూర్తి స్పృహతో ఉన్నాడంటూ ఇటీవల బ్లడ్ శాంపిల్ రిపోర్టు కూడా స్పష్టం చేసింది. షైనీని తొలుత పోలీసు కస్టడీలోకి తీసుకుని అనంతరం జ్యుడియషల్ కస్టడీలో ఉంచారు. షైనీపై వచ్చిన ఆరోపణలు కోర్టులో నిరూపణ అయితే ఆయనకు కనీసం ఏడైళ్లు జైలుశిక్ష పడే అవకాశాలుంటాయి. సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే జాతీయ మహిళా కమీషన్ కు చెందన ఓ బృదం ఇటీవల ముంబై చేరుకుని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను కలుసుకుంది. షైనీ అత్యాచారం కేసును త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇప్పటికే ప్రకటించారు.
News Posted: 2 July, 2009
|