కత్రినకు సెక్యూరిటీ సమస్య
స్టార్ డమ్ ఎంజాయ్ చేయడం ఎంత ఇష్టంగా ఉంటుందో దానితో పాటే వచ్చే సమస్యలు కూడా అంతే ఇబ్బందిగా ఉంటాయని బాలీవుడ్ మెరుపుతీగ కత్రినాకైఫ్ కు ఇప్పుడు స్వానుభవంలో తెలుసుకుంటోంది. కత్రిన ప్రస్తుతం తన సెక్యూరిటీ విషయంలో ఇలాంటి అభద్రతనే ఫీలవుతోంది. అయితే ఆ బెడద బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ వల్ల మాత్రం కాదు. ఫ్యాన్ విపరీతంగా పెరిగి పోవడం, కొందరు అత్యుత్సాహంతో ఆమెను చూసేందుకు ఫ్యాట్ లోకి చెరబడుతుండటం ఆమెను కంటికి కునుకు లేకుండా చేస్తోందట. ఈ బెడద ఇటీవల ఎక్కువ కావడంతో ప్రస్తుతం బాంద్రాలోని వాటర్ ఫీల్డ్ రోడ్డులో ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేసి కొత్త ఇంటికోసం తీవ్రయత్నాలు చేస్తోంది. నాలుగుగేళ్ల క్రితమే కత్రినా ఈ ఫ్లాట్ ను తన సొంత సంపాదనతో కొనుక్కుంది. కొత్త ఇంటికోసం అన్వేషిస్తున్న విషయాన్ని కత్రినా సైతం ధ్రువీకరించింది.
'సెలబ్రటీ స్టాటస్ వల్ల కొత్తింటి వెదుకులాట చాలా సమస్య అవుతోంది. తన పేరు తెలియగానే అసలు ధరను రెట్టింపు చేసి చెబుతున్నారు. నిజానికి ఎంత డబ్బు పెట్టయినా కొనడానికి ఇబ్బంది లేదు. కాకుంటే మంచి భద్రత ఉండే సేఫ్ ప్లేస్ మాత్రం అయిండాలి' అని కత్రినా చెప్పుకొచ్చింది. కత్రినా ప్రస్తుతం తన ఫ్లాట్ లో ఒకరిద్దరు మెయిడ్స్ తో ఉంటోంది. ఇలా ఒంటరిగా ఉండటం ఇబ్బందిగానే ఉందనీ, తనకు తోడుగా సోదరి ఇసెబెల్ కైఫ్ ను తెచ్చుకోవాలని అనుకుంటున్నాననీ చెప్పింది. ఇసెబెల్ ప్రస్తుతం నటనలో ప్రవేశానికి గాను లీ స్ట్రాస్ బెర్గ్ ఇన్ స్టిస్టూట్ లో శిక్షణ పొందుతోంది. కత్రినా ఫ్యాన్స్ తో పాటు కొద్దిరోజుల తర్వాత ఇసెబెల్ కు కూడా ఫ్యాన్స్ పెరిగితే కొత్త చిక్కులు రావూ?!
News Posted: 4 July, 2009
|