సల్మాన్ పెళ్లి అతనిష్టం...
'సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ తో ముందుకు వస్తే అందుకు సిద్ధంగానే ఉన్నాం. కత్రినా కైఫ్ ను తనకు తగిన జోడిగా సల్మాన్ భావిస్తున్నాడా లేదా అనేది మాత్రం నాకు తెలియదు' అని సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ తన తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
కత్రినాను కోడకులుగా అంగికరించనున్నారా అని అడిగిన ప్రశ్నకు 'సల్మాన్ ఫ్యామిలీ కత్రినాను ఎందుకు కోడకులుగా అంగీకరించాలి? పెళ్లి చేసుకునేది ఫ్యామిలీ కాదుగా. మొదట ఆమెను తన భార్యగా ఆమోదించాల్సింది సల్మానే. దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సింది కూడా అతనే' అంటూ తేల్చిచెప్పారు. పెళ్లిపై సల్మాన్ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటనేవి తనకు తెలియదనీ, అతన్నే అడిగితే బావుంటుందనీ నవ్వుతూ చెప్పారు. సల్మాన్ జీవితంలోకి చాలా మంది అమ్మాయిలే వచ్చారనీ, వారి పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేకపోయినా వాళ్లంతా మంచి ఫ్యామిలీస్ తో సెటిల్ అయ్యారనీ, అందరితోనూ తన అనుబంధం మాత్రం హాయ్ అంకుల్...హలో అంకుల్ అనే పిలుపులకే పరిమితమనీ అన్నారు. ఇంతకూ పెళ్లెప్పుడు చేస్తారని సూటిగా అడిగినప్పుడు 'ఇంకా ఆ రోజు రాలేదు. అతను ఎప్పుడు ఆ మంచి న్యూస్ వచ్చినా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. తనకు ఫలానా అమ్మాయి అయితే జీవితాంత సుఖంగా ఉంటానని సల్మాన్ మానసికంగా సిద్ధం కావాలి. ఆ తర్వాతే ఏదైనా' అని తేల్చిచెప్పారు. అంటే...సల్మాన్ కోర్టులోనే బాల్ ఉందన్నమాటేగా...
News Posted: 4 July, 2009
|