బాలీవుడ్ పై కాస్మెటిక్ భారం!
బాలీవుడ్ పై 'గుగ్లీ' వచ్చి పడింది. గ్లామర్ ప్రపంచంలో మనగలగాలంటే అందాలే పెట్టుబడిగా భావించిన తారలు ఎప్పటికప్పుడు కాస్మెటిక్ సర్జరీలపై ఆధారపడుతుంటారు. ముక్కు సర్జరీ నుంచి బ్రెస్ట్ అప్ లిప్టింగ్ సర్జరీల వరకూ ఈ కేటగిరిలో వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పుణ్యమాని ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీలు మరింత ప్రియం కానున్నాయి. వార్షిక బడ్జెట్ లో కాస్మటిక్ సర్జరీలను సర్వీస్ టాక్స్ పరిధిలోకి తీసుకురావడమే ఇందుకు కారణం.
కాస్మటిక్ సర్జరీలు చేయించుకున్న పలువురు ప్రచారానికి దూరంగా ఉంటారు. అయితే శిల్పాశెట్టి నుంచి సల్మాన్ ఖాన్, మినిస్సా లంబా వంటి పలువురు తారలు ఏదో రకమైన కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్న వారే. చాలా మంది స్టార్ గతంలో పశ్చిమ దేశాలకు వెళ్లి ఇలాంటి సర్జరీలు చేయించుకుని రావడం రివాజు. అయితే ఇప్పుడు అలాంటి సౌకర్యాలు, సామాగ్రి ఇండియాలోనే ఉండటంతో పలు సర్జరీలు ఇక్కడే
జరుగుతున్నాయి. అనేకమంది నటీనటులు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న సంగతి తనకు తెలుసుననీ, అయితే ఇలాంటివి చేయించుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదనీ నటి కొయినా మిత్రా వ్యాఖ్యానించింది. కొయినా మిత్రాకు జరిగిన ముక్కు సర్జరీ ఇలాంటి ప్రతికూల ఫలితానే ఇచ్చిందని అంటారు. అయితే సర్వీస్ టాక్స్ పరిధిలోకి కాస్మెటిక్ సర్జరీలు రావడం వల్ల ఆ సేవలు కోరుకునే వారిపై పెద్దగా ప్రభావం ఉండదని ముంబైకి చెందిన ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ మనోజ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సర్జరీలు చేయించుకోవాలనుకునే వాళ్లకు అదనపు టాక్స్ ఫీజ్ ను భరించడం పెద్ద కష్టం కాబోదనీ, పైగా ఆ సొమ్ము ప్రభుత్వ కార్పస్ కే జమ అవుతుందనీ అన్నారు.
News Posted: 7 July, 2009
|