శృతిహాసన్ బికినీ ల(లు)క్
కమల్ హాసన్, సారికల గారాల పట్టి శృతిహాసన్ ఇప్పటికే తొలి మ్యూజిక్ ఆల్బమ్ తో సంచలనం సృష్టించింది. కమల్ హాసన్ ద్విభాషా చిత్రం 'ఈనాడు'కు సంగీత దర్శకత్వం వహిస్తోంది. వీటికితోడు బాలీవుడ్ 'లక్' చిత్రం ద్వారా హీరోయిన్ గా కూడా త్వరలోనే ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. శ్రీ అష్టవినాయక్ సినీ విజన్ లిమిటెడ్ పతాకంపై సోహమ్ షా దర్శకత్వం వహించిన 'లక్' చిత్రం విడుదలకు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా శృతి బికినీలో కనిపించే స్టిల్స్ ఇప్పుడు పబ్లిసిటీ పరంగా సంచనలం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోయిన్లంతా సైజ్ జీరో ఆహార్యంతో బికినీ లుక్స్ తో పోటీపడుతుండగా, శృతి తొలి సినిమాలోనే బికినీ ధరించి తన తోటి హీరోయిన్లకు గట్టి సవాలే విసిరింది.
'దర్శకుడు సోహన్ ఈ చిత్రం స్క్రిప్టు చెప్పినప్పుడు అందులో సన్నివేశానికి అనుగుణంగా బికినీ ధరించాల్సి ఉంది. అదేమంత పెద్ద వ్యవహారంగా నాకు అనిపించలేదు. మిగతా సన్నివేశాల్లో ఎలా నటించానో బికినీతోనూ అంత కంఫర్టబుల్ గానే నటించాను' అంటూ శృతి చెప్పుకొచ్చింది. వృత్తిపట్ల శృతికి ఉన్న నిబద్ధత ఎంత చెప్పినా తక్కువే అవుతుందని దర్శకుడు సోహన్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. బికినీ ధరించాల్సి ఉంటుందని చెప్పినప్పటి నుంచి శృతి అందుకు అనుగుణంగా తన ఆహార్యాన్ని స్లిమ్ గా మార్చుకునేందుకు చాలా కష్టపడిందనీ, కేప్ టౌన్ లో ఈ సన్నివేశాన్ని కేవలం రెండు డిగ్రీల టెంపరేటర్ లో చిత్రీకరించామనీ, అలాంటి వాతావరణాన్ని కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ఎంతో సాహసంగా శృతి నటించిందనీ చెప్పారు. శృతికి స్టైలింగ్ చేసింది మరెవరో కాదు. దర్శకుడు సోహన్ భార్య, ఫ్యాషన్ డిజైనర్ అయిన బినల్ షా. శృతికోసం తాను డిజైన్ చేసిన బికినీ ఆమెకు అతికనట్టు సరిపోయిందనీ, స్విమ్మింగ్ ఫూల్ లో రాత్రి వేళ ఎఫెక్ట్ కు తగ్గట్టుగా గ్రీన్ షేడ్స్ తో పెరల్స్ తాపించి ఈ బికినీ డిజైన్ చేసినట్టు ఆమె తెలిపింది. యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న 'లక్' చిత్రం కోసం శృతి కొన్ని డేరింగ్ ఫైట్స్ చేయడం మరో విశేషం. ఇమ్రాన్ ఖన్, సంజయ్ దత్, మిథున్ చక్రవర్తి, డేనీ డెంగ్జాంపా తదితరులు ఈ చిత్రంలో నటించారు. సలీం సులేమాన్ సౌండ్ ట్రాక్ అందించారు. ఈనెల 24న 'లక్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
News Posted: 9 July, 2009
|