రామ్ దేవ్ పై సెలీనా గుర్రు!
యోగా గురు బాబా రామ్ దేవ్ స్వలింగ సంపర్కం ఓ 'వ్యాధి' అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాధిని 'యోగా' ద్వారా తాను నివారించగలనని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే రామ్ దేవ్ బాబా అసలు వైద్యుడే కాదనీ, అలాంటప్పుడు హోమో సెక్యువాలిటీ గురించి ఆయన మాట్లాడం ఏమిటనీ, అసల ఆయనకు 'గే'ల ఆంతరంగిక వ్యవహారార్లో జోక్యం చేసుకునే హక్కేముందనీ బాలీవుడ్ నటి, స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమకర్త సెలీనా జైట్లీ ఘాటుగా విరుచుకుపడింది.
స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో సెలీనా జైట్లీ వంటి హీరోయిన్లు అండగా నిలబడటంపై రామ్ దేవ్ సునిశితమైన విమర్శలు చేస్తూ 'తల్లిదండ్రులకు దూరంగా ఉండే ఈ తరం నటీమణులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సలు తెలియదు. పాశ్చాత్య సంస్కృతిని వారు ఒంటపట్టించుకుంటున్నారు. విలువలతో కూడిన వెయ్యేళ్ల ఘన చరిత్ర ఉన్న సొసైటీ మనది. పాశ్చాత్య సంస్కృతికి పాకులాడం ఎంతమాత్రం మంచిది కాదు' అన్నారు. స్వలింగ సంపర్కులకూ జంతువులకూ తేడా ఏమీ లేదనీ, వారు స్వార్థపరులనీ, వారికి తమ గురించే కానీ తమ కుటుంబాల గురించి పట్టింపే ఉండదనీ ఘాటైన విమర్శలు చేశారు. 10 నుంచి 50 ఏళ్ల వరకూ ఉండే స్వలింగసంపర్కులను తమ ఆశ్రమానికి రప్పించి ఒక తల్లిలా వారిని సాకుతూ ధాన్యం, ప్రాణాయామం ద్వారా వారిని హోమో సెక్యువాలిటీని నుంచి విముక్తులయ్యేలా కొత్తజీవితం అందిస్తున్నట్టు చెప్పారు. వారిలో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా ఉన్నట్టు తమకు చెబుతున్నారని అన్నారు. మరోవైపు గే-రైట్స్ ఛాంపియన్ సెలీనా ఆయన వ్యాఖ్యాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రామ్ దేవ్ బాబా అసలు వైద్యుడే కాదనీ, తనకు తాను వైద్యుడుగా చెప్పుకుంటూ హోమ్ సెక్యుయాలిటీ ఒక వ్యాధి అనీ, దానికి ప్రిస్కిప్షన్ తన వద్ద ఉందని చెప్పడం హాస్యాస్పదమనీ ఆమె వ్యాఖ్యానించింది. అసలు స్వలింగ సంపర్కం వ్యాదే కానప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ ఎవరు కొంటారని ఎద్దేవా చేసింది. 'స్వలింగ సంపర్కుల వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? వ్యక్తుల జీవితాల్లో, మత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. దురదుష్టం ఏమిటంటే ప్రతి ఒక్కరూ స్వలింగ సంపర్కుల వ్యవహారాల్లో తలదూర్చే వారే. వాళ్లు ఏమి తినాలో, ఎలా శయనించాలో, సెక్స్ లో ఎలా పాల్గొనాలో కూడా వీళ్లే డిక్టేట్ చేస్తుంటారు. బెడ్ రూమ్స్ లో ఎవరేమి చేస్తున్నారనే విషయాల ప్రాతిపదికగా ఎవర్నీ అంచనా వేయడం పద్దతి కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా బాబా తన ఆలోచనా ధోరణి మార్కుకుంటే మంచిది' అని సెలీనా హితవు పలికింది.
News Posted: 14 July, 2009
|