దీపిక చాలా చాలా హాట్!
'ఓం శాంతి ఓం' బ్యూటీ దీపిక పడుకొనే ఇప్పుడు తన అందాలతో మరింత హీట్ పెంచబోతోంది. ఈసారి వెండితెరపై కాకుండా సోప్ యాడ్ లో దీపిక తన అందాలను ప్రదర్శించబోతోంది. ఈమధ్యనే చెన్నైలో ఓ సోప్ యాడ్ షూటింగ్ లో దీపిక పాల్గొంది. మోడల్ రాకేష్ బాపట్ తో దీపిక చాలా క్లోజ్ గా కనిపించే సిజ్లింగ్ సన్నివేశాలను దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఎంతో ఓర్పుగా...నేర్పుగా చిత్రీకరించారు. అయితే దర్శకుడి పని మరీ అంత సులువుగా మాత్రం మాత్రం పూర్తి కాలేదు. దీపిక, రాకేష్ బాపట్ లకు ఒకరికొకరు పూర్తిగా కొత్త. దీంతో ఇద్దరి మధ్యా కెమెస్ట్రీ సరిగ్గా కుదరడానికి 45 టేక్ లు కేకుల్లా కరిగిపోయాయి. వీరిద్దరి మధ్యా మరింత చొరవ పెరిగేందుకు, సన్నివేశాలు రక్తి కట్టించేందుకు దర్శకుడికి ఫ్లాష్ లా ఓ ఆలోచన తట్టిందట. యాడ్ జింగిల్ కు బదులు దీపికకు ఇష్టమైన 'బచ్ నా హసీనా' టైటిల్ సాంగ్ ను ప్లే చేశారట. ఇంకేముంది? దీపిక మూడ్ లోకి వచ్చేసింది. టేక్ ఓకే అయిపోయింది.
దీపిక-రాకేష్ లు దాదాపు 50 టేక్ లు తీసుకున్న విషయాన్ని యూనిట్ వర్గాలు ధ్రువీకరించాయి. సోప్ యాడ్ కావడంతో షవర్ కింద ఇద్దరూ తడిసే ఓ షాట్ ను దర్శకుడు చిత్రీకరించాల్సి వచ్చిందనీ, అయితే సన్నివేశం సరిగ్గా కుదరకపోవడంతో పలు రీటేక్ లు అవసరమయయాయనీ వారు చెప్పారు. దీంతో దీపిక ఫేవరెట్ సాంగ్ వినిపిస్తే ఆమె సరైన మూడ్ లోకి రావచ్చనే ఆలోచన దర్శకుడు ప్రదీప్ సర్కార్, కెమెరామన్ అనిల్ హెమతాకు వచ్చిందనీ, ఆ సాంగ్ ప్లే చేయడంతో దీపిక యూనిట్ సభ్యులందరూ చూస్తుండగానే ఆ సన్నివేశాన్ని ఎంతో బాగా రక్తికట్టించిందనీ వివరించారు. ప్రదీప్ సర్కార్ ను ఈ విషయమైన సంప్రదించినప్పుడు దీపికకు ఇష్టమైన సాంగ్ ను ప్లే చేసిన విషయం నిజమేననీ, దీపిక నుంచి మంచి నటన, హావభావాలు రాబట్టుకోవడానికి ఈ ఈలోచన ఎంతగానో ఉపకరించిందనీ ఆయన చెప్పారు. ఎన్ని రీటేక్ లు అవసరమైందని అడిగినప్పుడు, యాడ్ ఫిల్మ్ అన్నప్పుడు డిఫరెంట్ షాట్స్ తీయాల్సి వస్తుందనీ, ఎడిటింగ్ ప్రోసస్ మొదలైన తర్వాత కానీ రీటేక్ ల సంఖ్య చెప్పలేననీ ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.
News Posted: 14 July, 2009
|