'న్యూయార్క్' చిత్రంలో గ్లామర్ తో పాటు నటనకు అవకాశమున్న పాత్ర పోషించిన ప్రశంసలు అందుకుంటున్న కత్రినా కైఫ్ గురువారంనాడు మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈసారి తన బర్త్ డే వేడుకను ముంబైలో కాకుండా లండన్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి సంబరంగా జరుపుకొంటోంది. అయితే గత ఏడాది తన బర్త్ డేను దగ్గరుండి మరీ జరిపించిన సల్మాన్ ఈసారి ఆమె వెంట లేరు. అలాగే ప్రస్తుతం లండన్ లోనే సాజిద్ నడియడ్ వాలా 'హౌస్ ఫుల్' షూటింగ్ లో పాల్గొంటున్న తన ఫేవరెట్ కో-స్టార్ అక్షయ్ కుమార్ ను కత్రిన దూరంగా ఉంచింది. 'ఈ ఏడాది తన బర్త్ డే పూర్తిగా ఫ్యామిలీ సభ్యుల మధ్యే జరుగుతుందని సల్మాన్ కు హామీ ఇచ్చిన తర్వాతే కత్రినా ముంబై ఫ్లయిట్ ఎక్కింది. అక్షయ్ లండన్ లోనే షూటింగ్ లో ఉన్నట్టు సల్మాన్ కు తెలియదని అనుకోలేం. ఇక నుంచి తన వ్యక్తిగత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని కత్రినా భావిస్తోంది. అక్షయ్ ను దూరంగా ఉంచడానికి ఇదో కారణం కావచ్చు' అని ఆమె సన్నిహితురాలు ఒకరు వ్యాఖ్యానించారు.
'నా జీవితంలో మరచిపోలేని బర్త్ డే ఇది' అని లండన్ లో సోమవారంనాడు తన కుటుంబ సభ్యులను కలిసిన కత్రినా సంబరం వ్యక్తం చేసింది. కత్రినకు ఆరుగురు సిస్టర్స్ ఉన్నారు. మళ్లీ కుటుంబ సభ్యులందరితోనూ కలిసి సంతోషాన్ని పంచుకోవడానికి మించిన గిప్ట్ మరొకటి ఉండదనీ, చాలాకాలంగా అంతా కలుసుకోవాలనే కల ఇప్పటికి నెరవేరిందనీ ఆమె పేర్కొంది. అక్షయ్ కూడా లండన్ లోనే షూటింగ్ లో పాల్గొంటున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు 'ఇది పూర్తిగా మా కుటుంబ సభ్యులకే పరిమితమైన విషయం. అక్షయ్ తో ప్రమేయం లేదు' అని తేల్చిచెప్పింది. ఈసారి కుటుంబ సభ్యులంతా కలిసి బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారని అడిగితే... 'అంతా కలిసి ఉండటమే ఓ పండుగ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్తామనేది పెద్ద విషయం కాదు' అంటూ నవ్వుతూ చెప్పింది కత్రినా. పనిలో పనిగా కత్రినా తన సోదరి ఐసాబెలాను కూడా త్వరలోనే బాలీవుడ్ కు పరిచయం చేయబోతోంది. ఇందులో భాగంగానే ఐసాబెలా నటనలో శిక్షణ కూడా తీసుకుంటోంది.