దేవ్ తో హిందీ 'నానోడిగల్'
బాలీవుడ్ లో ఇప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాల రీమేక్ సందడి ఎక్కువైంది. ఇంతవరకూ బాలీవుడ్ చిత్రాల రీమేక్ కు ప్రాంతీయ భాషా చిత్రాలు తహతహలాడుతుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. 'పోకిరి', 'బొమ్మరిల్లు', 'గజనీ' తదితర చిత్రాల తర్వాత తమిళంలో ఇటీవల సంచలన విజయం సాధించిన 'నానోడిగల్' సైతం హిందీలోకి రీమేక్ కు ప్రస్తుతం చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ లోకి రీమేక్ చేసేందుకు 'నాడోడిగల్' దర్శకుడు సముతిరాకని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవలే సొంతం చేసుకున్నారు. రవితేజ కథానాయకుడిగా త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. ఈ చిత్రం ద్వారా సముతిరాకని తెలుగులో దర్శకుడుగా పరిచయం కానుండటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
కన్నడ రీమేక్ ఈ ఏడాది చివర్లో ఉండబోతోందనీ, సూపర్ స్టార్ పునీత్ కథానాయకుడిగా నటించనున్నారనీ తెలుస్తోంది. ఆసక్తికరంగా హిందీ వెర్షన్ లో 'స్లమ్ డాగ్ మిలనయనీర్' ఫేమ్ దేవ్ పాటిల్ తో సుముతిరాకని సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. పనిలో పనిగా దేవ్ ప్రియురాలు ఫ్రిదాను కూడా ఒప్పిస్తే వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కు 'నానోడిగల్'ను చేరవ చేసే అవకాశం ఉంటుంది. సముతిరాకని ఏమంటారో?!
News Posted: 20 July, 2009
|