ప్రియాంక కు షాహిద్ చెక్?
ప్రియాంక చోప్రా బర్త్ డే పార్టీకి ఆమె ప్రియుడు షాహిద్ కపూర్ గైర్హాజర్ కావడం ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాశమవుతోంది. వీరి అనుబంధం ఇప్పటికే చిక్కుల్లో పడిందనీ, తాజా పరిణామంతో ఈ పరిస్థితి మరింత దిగజార్జినట్టే కనిపిస్తోందని ఆ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ప్రియాంక తన పుట్టినరోజు వేడుక జరుపుకొంది. ఇప్పటికే ప్రియాంక-షాహిద్ జంట ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఉన్నారనీ, ఆమె బర్త్ డే పార్టీకి షాహిద్ హాజరుకాకపోవడంతో ఈ విషయం మరింత బలపడుతోందనీ ఓ ప్రముఖ ముంబై పత్రిక పేర్కొంది.
ప్రియాంక బర్త్ డే పార్టీకి ఆమె మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షల కథనం. 'షాహిద్ ఈ వేడుకలో పాల్గొనకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ చివర్లో అయినా ఆయన వస్తారని అంతా అనుకున్నారు. నిజానికి ఇలాంటి ముఖ్యమైన సందర్భాన్ని మిస్ కాకుడదని అనుకునే వారెవరైనా సకాలంలోనే హాజరవుతారు' అని వారు అభిప్రాయపడ్డారు. ప్రియాంక కజిన్లు కూడా లండన్ నుంచి నేరుగా వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారనీ, అలాంటిది ప్రియాంక క్లోజ్ ఫ్రెండ్ గా అంతా అనుకునే షాహిద్ మాత్రం హాజరుకాకపోవడం ఆశ్చర్యంగానే ఉందనీ వారన్నారు. అయితే షాహిద్ లేని లేటును ఏమాత్రం ముఖంలో కనిపించకుండా అతిథులను రిసీవ్ చేసుకుంటూ ప్రియాంక సందడిగా కనిపించినట్టు వారు తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రియాంక, షాహిద్ ఇంకా పెదవి విప్పలేదు.
News Posted: 20 July, 2009
|