లండన్ లో షారూక్ ఫ్లాట్
బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ ఇప్పుడు లండన్ లో కూడా పాగా వశారు. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యుఎఎలో) భారీ ప్రాపర్టీ కలిగి ఉన్న షారూక్ ఇప్పుడు విదేశీ గడ్డపై మరో అత్యంత ఖరీదైన ప్రాపర్టీకి కూడా ఓనరయ్యారు. సెంట్రల్ లండన్ లోని పార్క్ లేన్ ఏరియాలో 20 మిలియన్ పౌండ్ల ఖరీదైన ఓ అపార్ట్ మెంట్ ను ఆయన ఇటీవల కొనుగోలు చేశారు.
లండన్ లోని పార్క్ లేన్ ఏరియాలోని ఈ అపార్ట్ మెంట్ పై షారూక్ కొద్దికాలం క్రితమే మనసుపడ్డారనీ, తన భార్య గౌరీతో కలిసి పలు దఫాలు చర్చించి చివరకు ఈ ప్రాంతాన్నే బెస్ట్ ఛాయెస్ గా ఎంచుకున్నారనీ షారూక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ నిర్ణయానికి రావడానికి ముందు అపార్ట్ మెంట్ ఖరీదు బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయంతో షారూక్ ఉన్నారనీ, ఈమధ్యనే ఆయన తన పిల్లలతో కలిసి ఆ ప్రాంతాన్ని చూసి తర్వాత డీల్ ఫైనలైజ్ చేసుకున్నారనీ ఆ వర్గాలు వివరించారు.
News Posted: 20 July, 2009
|