ఆగస్టు 2న నా పెళ్లి: రాఖీ
'రాఖీ కా స్యయంవరం' రియాల్టీ షోతో వరుణ్ణి వెతుక్కునేందుకు సెక్సీ క్వీన్ రాఖీసావంత్ చేపట్టిన కాంటెస్ట్ 'మాంగళ్యం తంతునానేన..'తో శుభం కార్డు పడబోతోంది. ఇదో రియాల్టీ స్టంట్ అంటూ తనపై వస్తున్న విమర్శలకు తెరదించుతూ..స్వయంవరంలో తన మనసు గెలుచుకున్న విజేతను ఆగస్టు 2న పెళ్లాడబోతున్నట్టు రాఖీ ప్రకటించింది. ఈ కాంటెస్ట్ లో ఎలెష్ పరుజన్ వాలా, చిటిజ్ జైన్, మనస్ కత్యాల్ అనే ముగ్గురు పోటీదారులు రాఖీ మనసు దోచుకున్నారనీ, వీరిలో ఒకరిని రాఖీ వరించే అవకాశం ఉందనీ ఛానెల్ వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కెనడా బిజినెస్ మన్ ఎలెష్ పరుజన్ వాలాను రాఖీ ఎంచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వారంటున్నారు.
'ఎలెష్ అందగాడే కాకుండా సున్నిత మనస్కుడుగా కూడా చూపరులను ఆకట్టుకుంటున్నాడు. ఇతర పోటీదారుల తరహాలో కాకుండా రాఖీని అంటకుండా దూరం నుంచే ఆయన తన ఆరాధానాభావాన్ని చాటుకుంటున్నాడు. ఆయనలోని ఈ క్వాలిటీస్ రాఖీని అమితంగా ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆమె తన సన్నిహితులతో కూడా ముచ్చటించిందట. అయితే...రాఖీ రెండు గంటలకు ఒకసారి మనసు మార్చుకుంటోంది కూడా' అని ఆ వర్గాలు తెలిపాయి. ఆసక్తికరంగా రాఖీ పెళ్లికూతురు దుస్తులను నీత లుల్లూ డిజైన్ చేయగా, ఆమె ఆభరణాలను ఫరా ఖాన్ డిజైన్ చేశారు. పెళ్లి ముచ్చటపై రాఖీని కదిపినప్పుడు 'ఇది రిగ్గింగ్ షో అంటూ కొందరు పెదవి విరుస్తున్న విషయం నాకు తెలుసు. నమ్ము నమ్మండి. వివాహ వ్యవస్థ పట్ల నాకెంతో గౌరవం ఉంది. ఆలా గౌరవించని కుటుంబాలను నేను చాలానే చూశాను. నా తల్లిదండ్రులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. నేను అలా కాదు. ఆగస్టు 2న ఆ విషయం అందరికీ తేటతెల్లమవుతుంది' అని ఆమె స్పష్టం చేసింది. వరుడు ఎలెష్ కావచ్చా అని అడిగినప్పుడు 'కావచ్చు. అతను చాలా మంచి కుర్రాడు. స్వచ్ఛమైన ప్రేమంటే నాకెంతో ఇష్టం. అది అతని కళ్లలో కనిపించింది. ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ నవ్వేసింది. వివాహానంతరం కెనడా షిఫ్ట్ అయ్యే అవకాశంపై మరో ప్రశ్న సంధించినప్పుడు, వివాహానంతరం తన భర్త, తాను ఎవరి పనుల్లో వారు బిజీ అవుతామనీ, కెరీర్ ను వదులుకునే ప్రసక్తి మాత్రం నిశ్చయంగా లేదనీ తెలిపింది. అయితే దూరం ఎక్కువగా ఉంటే వివాహ బంధాలు సజావుగా సాగవని గడుసుగా చెప్పుకొచ్చింది. ప్రతి పెళ్లికూతురు తన పెళ్లి జన్మనిచ్చిని అమ్మ సమక్షంలో జరగాలని కోరుకుంటుందనే విషయం తనకు తెలుసనీ, అయితే తన తల్లితో అనుబంధం ఎప్పుడో తెగిపోయిందనీ, బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్థీ విషయం కూడా అంతేననీ పేర్కొంది. 'నేను బాగుండాలని అభిషేక్ విసెష్ చెబుతాడనే అనుకుంటున్నాను. ఇక నుంచే నా కొత్త జీవితం మొదలవుతుంది' అని రాఖీ తెలిపింది.
News Posted: 22 July, 2009
|