దీపికకు మలేరియా జ్వరం
'ఓం శాంతి ఓం' ముద్దుగుమ్మ దీపిక పడుకునే మలిరియా బారిన పడింది. లండన్ లో 'హౌస్ పుల్' షూటింగ్ లో పాల్గొంటున్న దీపిక కొద్దిరోజులుగా ఒంట్లో అస్వస్థతతో బాధపడుతోంది. తొలుత ఇది వైరల్ ఎటాక్ గా భావించినప్పటికీ వైద్య పరీక్షల అనంతరం ఆమె మలేరియాతో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో బుధవారంనాడు జరగాల్సిన షూటింగ్ వాయిదా పడింది.
అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొనవలసి ఓ సన్నివేశంలో నటించేందుకు దీపిక ఓపిక చేసుకుని ముందుకు వచ్చినప్పటికీ నిర్మాత సాదిజ్ నడియడ్ వాలా, దర్శకుడు సాజిద్ ఖాన్ లు ఆమెను పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించి షూటింగ్ కేన్సిల్ చేశారు. లండన్ లో అడుగుపెట్టినప్పటి నుంచి దీపిక అస్వస్థతతోనే ఉందనీ, పెయిన్ కిల్లర్స్ , డ్రగ్స్ తీసుకుంటూ వచ్చిందనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. అయితే జ్వరం తగ్గకపోవడంతో వైద్యుని సంప్రదించారనీ, వైద్య పరీక్షల అనంతరం మలేరియా జ్వరంగా వైద్యులు ధ్రువీకరించారని వారు తెలిపారు. 'దీపిక కొద్దిరోజుల క్రితం ప్రదీప్ సర్కార్ తో కలిసి ఓ సోప్ యాడ్ లో పాల్గొన్నారు. అందులో భాగంగానే ఎక్కువ సేపు షవర్ కింద తడవడంతో ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చింది. మలేరియా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో దీపక చాలా అప్ సెట్ అయింది. గతంలో కూడా ఓం శాంతి ఓం సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే బుధవారంనాడు ఆమె మంచం నుండి కదలలేకపోయింది' అని యూనిట్ వర్గాలు తెలిపాయి. దీపిక బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ ఎప్పటి కప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దీపిక సైతం సాధ్యమైనంత త్వరలో లండన్ షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం ఆమె నటించగా విడుదలకు సిద్ధమవుతున్న 'లవ్ ఆజ్ గల్' చిత్రం మంబై ప్రమోషన్ వర్క్ లో పాల్గొనవలసి ఉంది.
News Posted: 23 July, 2009
|