ఐశ్వర్యరాయ్ కి వృత్తిపట్ల నిబద్ధత గల ఆర్టిస్టుగా మంచి పేరుంది. ఎంతో నెమ్మదిగా కనిపిస్తుంటారు. అయితే ఆమెలో అగ్రెసివ్ కోణం కూడా లేకపోలేదు. ఈమధ్యనే కేన్స్ ఫెస్టివల్ లో కొత్తనటుడు సోనమ్ కపూర్ తో కలిపి రెడ్ కార్పెట్ ను పంచుకునేందుకు ఆమె నిరాకరించడం ఇందుకో ఓ ఉదాహరణ. తాజాగా విపుల్ షా 'యాక్షన్ రీప్లే' సెట్స్ లో మరోసారి ఐశ్వర్య తన సత్తా చాటుకుందట. ఈ సినిమా కోసం నిర్మాత ఎరేంజ్ చేసిన అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్టులను కాదని తన పర్సనల్ మేకప్ మాన్ ఓజాస్ రజనీతోనే మ్యాకప్ చేయించుకుంటానంటూ పట్టుబట్టారట.
'హీరో అక్షయ్ కుమార్ తో సహా తక్కిన ఆర్టిస్టులందరి కోసం పలువురు మేకప్ ప్రొఫెషనల్స్ ను షా రప్పించారు. షూటింగ్ కు ముందే ఆర్టిస్టులంతా మేకప్ ఆర్టిస్టుల వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లి మేకప్ వేయించుకోవాలని షో కోరారు. హాలీవుడ్ లో ఇదే ప్రక్రియ నడుస్తుంది. షా సూచన మేరకు ఆర్టిస్టులంతా మేకప్ వ్యాన్ దగ్గరకు వెళ్లారు. ఐశ్వర్య మాత్రం అందుకు ససేమిరా చెప్పింది. తన సొంత మేకప్ ఆర్టిస్టుతోనే మేకప్ వేయించుకునేందుకు పట్టుబట్టింది. ఐశ్వర్య కాదంటే షూటింగ్ ఆగిపోతుందని గ్రహించిన షా అందుకు అంగీకరించక తప్పలేదు. ఆమె వ్యక్తిగత మేకప్ ఆర్టిస్టు ఒజాస్ రజనీని సెట్స్ కి రప్పించారు' అని విశ్వసనీయ వర్గాల తెలిపాయి. ఐశ్వర్య గతంలో గురిందర్ చద్దా 'బ్రైడ్ అండ్ ప్రిజుడీస్' చిత్రం విషయంలోనూ నిర్మాత ఎరేంజ్ చేసిన మేకప్ మన్ లను దగ్గరకు రానీయ లేదు. 'యాక్షన్ రీప్లే' సెట్స్ లో జరిగిన సంఘటనపై విపుల్ షాను సంప్రదించినప్పుడు 'ఇది పూర్తిగా నిరాధారమైన వార్త. ఐశ్వర్యను తప్పుపట్టే కథనాలపై జనాలకు ఇంత ఆసక్తి ఎందుకో ఆర్ధం కాదు. ఆమె మంచి ఫ్రొఫెషనల్. ఏరోజూ షూటింగ్ కు ఆమె అంతరాయం కలిగించలేదు' అంటూ ఐష్ కు ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు.