ప్రియాంక బొడ్డు పుడక!
బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా తన 27వ బర్త్ డేని ఎప్పటికీ మరచిపోలేనంటోంది. గత శుక్రవారమే తన బర్త్ డే వేడుకను ముంబైలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో ఉత్సాహంగా ఆమె జరుపుకొంది. అంతా అనుకుంటున్నట్టుగానే ప్రియాంకతో ప్రేమాయణానికి చెక్ పెట్టిన షాహిద్ కపూర్ ఆ పార్టీకి గైర్వాజర్ అయ్యారు. ప్రియాంక సైతం ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోనట్టుగా సందడిగా కనిపించింది. ఆమె సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఓ అపురూపమైన కానుక కూడా ఆమె చేతికొచ్చింది. ఆ కానుక వజ్రం తొడిగిన బొడ్డు పుడక. ప్రియాంకపై తమకున్న ప్రేమను చాటుకుంటూ ఈ కానుకను ఆమె తల్లిదండ్రులే బహూకరించారు.
తన పేరెంట్స్ ఎంతో మోడ్రన్ అనీ, వారి నుంచి ఇంత క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ తాను ఊహించలేదనీ ప్రియాంక సంబర పడిపోతోంది. డైమండ్స్ ప్రెజెంట్ చేసే నిలకడైన బాయ్ ఫ్రెండ్ లేకపోయినా కూతురి మనసెరిగిన తల్లిడండ్రులు దొరకడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ప్రియాంక ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆ గిఫ్ట్ ను తన నాభికి అలంకరించేసిందట కూడా. ఆమె తదుపరి చిత్రంలో ఆమె నాభి పుడక తళుకులు ప్రేక్షకులకు కనువిందు చేయెచ్చు.
News Posted: 24 July, 2009
|