బిగ్ బజార్ లో ఆసిన్-ధోని
దక్షిణాదిలో హీరోయిన్ గా సత్తా చాటుకుని 'గజనీ' తో బాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలుగుతున్న ఆసిన్ పలు ప్రిస్టేజియస్ ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. వీటిలో సూపర్ స్టోర్స్ చైన్ గా మంచి పేరున్న బిగ్ బజార్ సైతం ఉంది. ఇంతవరకూ బిగ్ బజార్ కోసం ప్రింట్స్ యాడ్స్ కు పనిచేసిన ఆసిన్ ఇప్పుడు టీవీ కమర్షియల్ యాడ్ కూడా చేస్తోంది. ఆసక్తికరంగా ఇదే బ్రాండ్ కు ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.థోని కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈమధ్యనే ఆయన సెక్సీ గాళ్ బిపాసాబసుతో కలిసి రీబాక్ యాడ్ లో పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆసిన్ తో జతకట్టారు. ఈ ఇద్దరిపై తాజగా ముంబైలోని ఫిల్మ్ సిటీలో 'బిగ్ బజార్' టీవీ కమర్షియల్ యాడ్ ను చిత్రీకరించారు.
ఈ యాడ్ కోసం ధోని-ఆసిన్ రోజంతా కలిసి పనిచేశారు. ఇద్దరూ రకరకాల కాస్ట్యూమ్స్ మారుస్తూ సందడి సృష్టించారు. ఈ యాడ్ ఆగస్టు ద్వితీయార్థం నుంచి అన్ని ఛానెల్స్ లోనూ ప్రసారమవుతుంది. ధోని ప్రస్తుతం కొద్దిపాటి బ్రేక్ అనంతరం సెప్టెంబర్ లో శ్రీలంకలో జరుగనున్న ట్రై-సిరీస్ లో పాల్గొనబోతున్నారు. ఆసిన్ హిందీ 'లండన్ డ్రీమ్' లో సల్మాన్ తో కలిసి నటిస్తూ, ఇండో-జపనీస్ వెంచర్ కోసం రెడీ అవుతోంది.
News Posted: 25 July, 2009
|