అమీర్ కు కిరణ్ 'స్టార్ట్..కట్'
స్టార్ ఖాన్ అమీర్ ఇప్పుడు తన ముద్దుల భార్య కిరణ్ రావు చెబుతున్న 'స్టార్ట్..కట్' ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అమీర్ ఖాన్ తాజాగా 'ధోబి ఘాట్' అనే చిత్రంలో నటిస్తూ కిరణ్ రావును దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎక్కువ చర్చ జరక్కుండా అమీర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ లో స్వయంగా ఒప్పుకున్నారు.
కిరణ్ తన సినిమా ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉండాలని కోరుకుంటోందనీ, దీంతో ప్రచారార్భాటాలకు దూరంగానే చిత్రం రూపొందుతోందనీ అమీర్ పేర్కొన్నారు. 'తక్కువ సిబ్బందితో సహజమైన లొకేషన్లలో గెరిల్లా స్టైల్ లో సినిమా తీయాలని కిరణ్ కోరుకుంటోంది. మీడియాకు ఏ సీక్రెట్ చెప్పాలన్నా ముందు షూటింగ్ పూర్తవ్వాలి' అని అమీర్ స్పష్టం చేశారు. 'దోభీ ఘాట్'లో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పేందుకు కూడా ఆయన నిరాకరించారు.. 'కిరణ్ వద్దంది. నేను సరే అన్నాను. ఆమె మాటే నా మాట' అని అమీర్ తన భార్యా విధేయతను కూడా చాటుకున్నారు.
News Posted: 25 July, 2009
|