రాఖీ సావంత్ పై చీటింగ్ కేసు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్, మరో ఆరుగురిపై ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయాల్సిందిగా జైపూర్ లోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు 'రాఖీ కా స్వయంవర్' పేరుతో రాఖీ నిర్వహిస్తున్న రియాలిటీ షో ఆమెకు ఈ కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టింది. పెళ్లిళ్లపై 'స్వయంవరం డాట్ కామ్' అనే తన ప్రైవేట్ పోర్టల్ లోని కాన్సెప్ట్ ను ఎన్టీటీవీ ఇమేజన్ ఛానెల్ దొంగిలించి కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ గౌరవ్ తివారీ అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశారు.
'స్వయంవరం' అనే టైటిల్, అందుకు సంబంధించిన స్క్రిప్టుపై తాను 2008లో మేథాసంపత్తి హక్కులు పొందాననీ, ఆ విషయాన్ని ఓ ప్రైవేట్ ఛానెల్ లో కూడా ప్రసారం చేశామనీ తివారీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాఖీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శిల్పా సమీర్ పోలీసులను ఆదేశించారు. ఈ షోలో పాల్గొంటున్న నటుడు రవికిషన్ , ఎన్టీటీవీ-ఇమాజిన్ ఎండి గౌరవ్ గాంధీ, షో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మరో ఇద్దరి కూడా కేసులు నమేదు చేయాలనీ, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని కూడా మేజిస్ట్రేట్ సూచించారు.
News Posted: 29 July, 2009
|