సింగర్ గా రెహ్మాన్ తనయుడు
ఆస్కార్ అవార్డులతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రెహ్మాన్ ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ 'ప్రౌడ్ ఫాదర్' అనిపించుకుంటున్నారు. ఆరున్నరేళ్ల ఆయన కుమారుడు అలీమ్ ఇప్పుడు ఎకాఎకిన హాలీవుడ్ సింగర్ గా అవతారమెత్తారు. అలీమ్ కు గాయకుడు కావాలనే కోరిక పసిప్రాయం నుంచే ఉందట. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఇంకెందుకు సమయం వృథా అనుకున్నాడేమో ఏమో ఇప్పుడు ఎకాఎకిన సింగర్స్ బెటాలియన్ లో చేరిపోయాడు. హాలీవుడ్ చిత్రం 'కపుల్స్ రిట్రీట్' కోసం ఓ పూర్తి పాటను గతవారం అలీమ్ సునాయాసంగా పాడేశాడు.ఈ చిత్రానికి రెహ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
పసిప్రాయంలోనే హాలీవుడ్ సాంగ్ ను అలీమ్ ఎంతో నేర్పుగా పాడటాన్ని రెహ్మాన్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారనీ, ఆనందంతో సంబరం జరుగుపుకొంటున్నారనీ రెహ్మాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సలీం సాధించిన ఘనతను చూసి అతని తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారని వారు చెప్పారు. 'కపుల్ రిట్రీట్'ను రొమాంటిక్ కామెడీ చిత్రంగా దర్శకుడు పీటర్ బిల్లింగ్స్లే తెరకెక్కిస్తున్నారు. విన్స్ వాఘన్, క్రిస్టిన్ బెల్, జాసన్ బేతమన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా థీమ్ కు తగినట్టు ఎంతో అహ్లాదమైన సంగీతాన్ని రెహ్మాన్ అందిస్తున్నారు. 2009లో ఈ చిత్రం విడుదలవుతుంది.
News Posted: 29 July, 2009
|