పార్లమెంటులో 'స్లమ్ డాగ్..'
భారతీయల చిరకాల స్వప్నం ఫలించి 8 ఆస్కార్ అవార్డులను తెచ్చిపెట్టిన డానీ బోయిల్ 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రం టీమ్ కు ఇప్పుడు సొంతగడ్డలో అపూర్వ సత్కారం జరగబోతోంది. దేశంలోని అత్యున్నత పొలిటికల్ హౌస్ అయిన పార్లమెంట్ నుంచి ఈ గౌరవం ు దక్కనుంది. ఈ చిత్రం ద్వారా రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, మరో అవార్డు సొంతం చేసుకున్న రసూల్ పూకుట్టి, గేయరచయిత గుల్జార్ తో సహా ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరినీ అవార్డులతో సన్మానించాలని పార్లమెంటు నిశ్చయించింది. లోక్ సభ స్వీకర్ మీరా కుమార్ చేతుల మీదుగా ఆగస్టు 3న ఈ అవార్డు సెర్మనీ జరుగుతుంది.
'స్లమ్ డాగ్..' టీమ్ కు అవార్డుల ప్రదానంతో పాటు ఇదే రోజు పార్లమెంటు సభ్యుల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు పార్లమెంటు సత్కారం కూడా దక్కనుండటం ముదావహం.
News Posted: 1 August, 2009
|