టోరంటోకు 2 హిందీ సినిమాలు
ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్ఎఫ్)లో ప్రీమియర్ కు బాలీవుడ్ నుంచి రెండు చిత్రాలు వెళ్తున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ 'దిల్ బోలే హడిప్పా' , అశుతోష్ గోవారికర్ 'వాట్స్ యువర్ రాశి' టి.ఎ.ఎఫ్.ఎఫ్. వరల్డ్ ప్రీమియర్ లో చోటు సంపాందించుకున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకూ జరిగే ఈ ఫెస్టివల్ జరుగనుంది.
హిలేరియస్ డ్రామా-కామెడీ చిత్రంగా 'దిల్ బోలో హడిప్పా' చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ సింగ్ తీర్చిదిద్దారు. షాహిద్ కపూర్ (రోహన్), రాణి ముఖర్జీ (వీర్ కౌర్) ప్రధాన పాత్రలు పోషించారు. అనుపమ్ ఖేర్, దిలీప్ తహ్లి, రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. గుజరాతీ యువకుడు తన డ్రీమ్ గాళ్ కోసం అన్వేషించే కథతో కామెడీ-రొమాన్స్ మిళితం చేసి 'వాట్స్ యువర్ రాశి' చిత్రాన్ని అశుతోష్ తెరకెక్కించారు. హర్మాన్ బవేజా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
News Posted: 1 August, 2009
|