ఎన్టీటీవీ ఇమాజిన్ లో ప్రసారమైన 'రాఖీ కా స్వయంవరం' రియాల్టీ షో తుది ఎపిసోడ్ కు 6.3తో హైయెస్ట్ టెలివిజన్ రేటింగ్ (టివిఆర్) నమోదైంది. ఈ ఏడాది ప్రసారమైన డజనుకు పైగా రియాల్టీ షోల తుది ఎపిసోడ్స్ ను తోసిరాజని హైయెస్ట్ టివిఆర్ ను రాఖీ 'స్వయంవరం' దక్కించుకుంది. టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీ ఎమాప్ తన తాజా వ్యూవర్ షిప్ డాటాలో రాఖీ స్వయంవరానికి టాప్ రేటింగ్ పట్టం కట్టింది.
'రాఖీ కా స్వయంవరం' రియాల్టీ షో 27 ఎపిసోడ్లు ప్రసారమైంది. చివరి ఎపిసోడ్ ఆగస్టు 2న జరిగింది. 16 మంది పోటీదారుల్లో కెనడాకు చెందిన ఎలేష్ పరుజన్ వాలాతో రాఖీ నిశ్చితార్థం ఇదే రోజు జరిగింది. ఓవరాల్ రేటింగ్ లో 20 నుంచి 25 శాతం రేటింగ్ ను ఎన్టీడీవీ ఇమేజన్ ఈ షోతో దక్కించుకుందని మీడియా ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఎమాప్ డాటా ప్రకారం...రెండున్నర గంటల పాటు జరిగిన 'రాఖీ కా స్యయవరం' ఫైనల్ ఎపిసోడ్ కు 6.3 టెలివిజన్ రేటింగ్ దక్కింది. ఇది ఈ ఏడాది జరిగిన మిగతా రియాల్టీ షోల ఫైనల్స్ కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరి 24న జరిగిన సింగింగ్ రియాల్టీ షో 'సరెగమ' ఫైనల్ కు 6.1 రేటింగ్ దక్కగా, జీటీవీలోనే ప్రసారమైన 'డాన్స్ ఇండియా డాన్స్'కు కూడా 6.1 రేటింగ్ దక్కింది. అలాగే వీక్షకులు రాఖీ ఫైనల్ షో కోసం యావరేజ్ గా 59 నిమిషాలు కేటాయించడం కూడా రికార్డుగానే పేర్కొంది. 'రాఖీ కా స్వయంవరం' ప్రసారమైన సమయంలో (జూన్ 29 నుంచి ఆగస్టు 2 వరకూ) కొత్తగా ప్రారంభమైన ఇతర రియాల్టీ షోల రేటింగ్ దిగజారుతూ వచ్చినట్టు ఎమాప్ వర్గాలు తెలిపాయి. ఆ ప్రకారం స్టార్ ప్లస్ లో అంతకుముందు 4కు పైగా టివిఆర్ ఉన్న 'సచ్ కా సామ్నా' రియాల్టీ షో రేటింగ్ చివరి ఎపిసోడ్ నాటికి (జూలై 31) 2.2 నుంచి 2.4 మధ్యలో ఉంది. అలాగే సోనీ టీవీలో ప్రసారమవుతున్న 'జంగిల్ సే మఝే బచావో'కు మొదట్లో రేటింగ్ 2 వరకూ ఉండగా అది 1 టివిఆర్ కు జారిపోయింది.