పబ్లిక్ లో చిక్కిన దేవ్-ఫ్రిదా!
ప్రేమ మాట ఉత్తదేనంటూ కొద్ది నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' జంట దేవ్ పటేల్, ఫ్రిదా పింటో ఇప్పుడు తమ ప్రేమాయణం లోకవిదితం చేయాలనుకుంటున్నారు. ఇటీవల లండన్ లో జరిగిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' స్క్రీనింగ్ కు హాజరైన ఈ ఇద్దరూ ప్రేమజంట తరహాలో చెట్టాపట్టాలు వేసుకుని బయటకు రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. డేనీబొయిలే దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్...' షూటింగ్ లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ, అయితే ఈ ఇద్దరూ కలిసి ఎప్పుడూ పబ్లిక్ లోకి రాలేదనీ, ఇప్పుడు ఆ ఇద్దర్నీ కలిసి చూడటంతో అభిమానులు ఎంతో థ్రిల్ అయ్యారనీ డైలీ మెయిల్ తెలిపింది.
దేవ్ పటేల్ ఇటీవల ఫ్రిదాతో కలిసి డిన్నర్ కు హాజరయ్యారు. అయితే ఫోటోగ్రాఫర్ల బారిన పడకుండా దేవ్ ముఖం చాటేశారు. దేవ్-ఫ్రిదా పీకల్లోతు ప్రేమలో పడ్డారంటూ కొద్దికాలంగా వస్తున్న వదంతులను సైతం మొదట్లో ఈ ఇద్దరూ తోసిపుచ్చారు. తాము మంచి మిత్రులం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇద్దరి కో-స్టార్ అయిన అనిల్ కపూర్ 'దేవ్-ఫ్రిదా జంటను కలుసుకున్నప్పుడు ఈ ఇద్దరి మధ్యా ఏదో ఉందని నాకు అనిపించింది' అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. దేవ్ తనను వదుల్చుకున్నాంటూ అతని మాజీ ప్రియురాలు రోహన్ అనటోవ్ సైతం తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఎట్టేకేలకు దేవ్-ఫ్రిదా పబ్లిక్ రొమాన్స్ ద్వారా తమ ప్రేమాయణం నిజమేనని బహిర్గతం చేశారు.
News Posted: 4 August, 2009
|