బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి కూడా ముద్దు వ్యవహారమే ఆమెను చిక్కుల్లో నెట్టడం విశేషం. ఎయిడ్స్ ప్రచారంలో భాగంగా ఇండియా వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె ఆమెను డయాస్ పైనే అందరూ చూస్తుండగా ఒడుపుగా పట్టుకుని ముద్దు పెట్టుకోవడం అప్పట్లో వివాదం సృష్టించింది. తాజాగా ఆమెను ఓ అర్చకుడు అందరూ చూస్తుండగానే దేవాలయంలో ముద్దుపెట్టుకోవడం దుమారం రేపుతోంది.
షూటింగ్ లో భాగంగా శిల్ప ఇటీవల ఒరిస్సాలోని సాక్షిగోపాల స్వామి ఆలయాన్ని ఇటీవల సందర్శించింది. ఆ గుడి ఆవరణలోనే షూటింగ్ జరుగుతోంది. ఆలయంలో సాక్షిగోపాల స్వామిని దర్శించేందుకు వెళ్లిన శిల్పను అక్కడి వృద్ధ అర్చకుడు ఆశీర్వదిస్తూ ఆలయంలో ఉన్న విషయాన్ని మరిచిపోయి ఆమె బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టుకున్నారు. శిల్ప తనదైన శైలిలో నవ్వుతుండగా ఫోటో ఫ్లాష్ లు మెరిసాయి. ఇప్పుడు ఇదే విషయం ఫోటోలతో సహా వార్తాకథనాలుగా రావడంతో పలువురు శిల్పాపై గుర్రుమంటున్నారు. ఈ అంశం ప్రస్తుతం వివాదానికి కేంద్రబిందువు అవుతోంది.