మహాజన్ 'స్వయంవరం'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Rahul-Mahajan.jpg' align='right' alt='Rahul mahajan'>ఎన్టీటీవీ ఇమాజిన్ లో ప్రసారమైన 'రాఖీ కా స్వయంవరం' ద్వారా తనకు నచ్చిన వరుడిని రాఖీ సావంత్ ఎంచుకుని తన సొంతం చేసుకుంది. టీవీ ఛానల్ ద్వారా ఈ తరహా స్వయంవరం జరగడం ఇదే ప్రథమం. 27 ఎపిసోడ్లు ప్రసారమైన 'రాఖీ కా స్వయంవరం' రియాల్టీ షో హైయెస్ట్ టెలివిజన్ రేటింగ్ నమోదు చేసుకుని మరో సంచనలం సృష్టించింది. ఇంతగా సంచనలం సృష్టించిన ఈ రియాల్టీ షో సెకెండ్ ఎడిషన్ కూడా త్వరలోనే బుల్లితెర వీక్షకుల ముందుకు రాబోతోంది. మళ్లీ 'స్వయంవరం' కాన్సెప్ట్ తోనే ఇదే ఛానెల్ లో ఈ రియాల్టీ షో ఉండబోతోంది. రాఖీ షోలో అబ్బాయిలు ఆమె కోసం పోటీపడితే, ఈసారి జరగబోయే స్యయంవరంలో అబ్బాయి కోసం అమ్మాయిలు పోటీపడతారు. ఇంతకూ అమ్మాయిలను అట్రాక్ట్ చేయనున్న ఆ వరుడు మరెవరో కాదు. 'బిగ్ బాస్ -2'తో అందర్నీ అలరించిన రాహుల్ మహాజన్.
మహాజన్ కు అప్పట్లో శ్వేతాసింగ్ తో వివాహం జరిగినప్పటికీ భర్త తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆమె విడాకులకు వెళ్లింది. 'బిగ్ బాస్ -2 ' సమయంలో పాయల్ రోహత్కి తో నూ, ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ అబూసలేం ప్రియురాలు మోనికా బేడితోనూ మహాజన్ ఎఫైర్ నడుపుతున్నట్టు ప్రచారమూ జరిగింది. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మహాజన్ స్వయంవరాన్ని ఎస్.ఓ.ఎల్. ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాండిల్ చేయబోతోంది. మహాజన్ ఎన్టీటీవీ ఆఫీస్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్టు కూడా ఊహాగానాలు కొద్దికాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. రాఖీ సావంత్ 'స్వయంవరం' అందరి దృష్టిని ఆకర్షించిందనీ, అలాంటి సంచలనమే మరోసారి సృష్టించాలంటే తగిన వ్యక్తి రాహుల్ మహాజన్ మాత్రమేననీ ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు 'ఇదే ప్రశ్న చాలామంది నన్నడిగారు. అయితే సదరు ఛానెల్ వాళ్లు నాతో స్యయంవరం షో చేయాలని అనుకుంటున్న విషయం నాకు తెలియదు. అలాంటి ఆఫర్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను' అని వివరణ ఇచ్చారు. అయితే 'రాఖీ కా స్వయంవరం' షో కాన్సెప్ట్ కు పనిచేసిన ఆదిత్య భట్ మాత్రం తదుపరి సీజన్ రాహుల్ మహాజన్ తో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆయనను ఛానెల్ నిర్వాహకులు సంప్రదించనున్నారనీ, రాఖీని పెళ్లి చేసుకునేందుకు యువకులు తహతహలాడినట్టే మహాజన్ ను ఇష్టపడే అమ్మాయిలు కూడా నిశ్చయంగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఛానెల్ సిఇవో సమీర్ నాయిర్ ను సంప్రదించినప్పుడు...ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలేననీ, ఇతమిద్ధంగా తాను ఏమీ చెప్పలేననీ స్పష్టం చేశారు.
News Posted: 8 August, 2009
|