మణి మండోదరి రీమాసేన్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/reemasen2.jpg' align='right' alt='Reema sen'>మణిరత్నం ద్విభాషా చిత్రం 'రావణ' పలు చిక్కులు, ఆటుపోట్ల మధ్య నిర్మాణం జరుపుకొంటూ ఆందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మణిరత్నం తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని హిందీ (రావణ), తమిళ (అశోకవనం) భాషల్లో రూపొందిస్తున్నారు. పురాణేతిహాసాలను చిత్రకథలుగా తీయడంలో మణిరత్నం ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. మహాభారతంలోని కర్ణుడి పాత్రను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో 'దళపతి' చిత్రాన్ని తీసిన మణి ఇప్పుడు 'రామాయణం' స్ఫూర్తితో మోడ్రన్ వెర్షన్ లో 'రావణ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీ వెర్షన్ లో రాముడి తరహా పాత్రను అభిషేక్, సీత తరహా పాత్రను ఐశ్వర్యారాయ్, రావణుడి తరహా విలనీ పాత్రను విక్రమ్ పోషిస్తున్నారు. తమిళ వెర్షన్ లో ఐశ్వర్యకు జోడిగా విక్రమ్, విలన్ గా పృధ్వీరాజ్ నటిస్తున్నారు. రెండు వెర్షన్లలోనూ విలన్ చెల్లెలుగా సూర్పణక తరహా పాత్రను ప్రియమణి పోషిస్తున్నారు. ప్రియమణికి ఇది తొలి హిందీ చిత్రం కావడం విశేషం. మణిరత్నం ఇప్పటికీ పలు పాత్రల కోసం కొత్తవారిని ఎంపిక చేసుకుంటూ సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రంలో మండోదరి పాత్ర కోసం జరుపుతున్న అన్వేషణ పూర్తయినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
తొలుత మండోదరి పాత్ర కోసం నయనతారను సుహాసిని మణిరత్నం సంప్రదించారు. అయితే తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నందున డేట్ల సమస్య ఉందంటూ నయనతార ఆ అవకాశాన్ని తోసిపుచ్చింది. ఐశ్వర్య, ప్రియమణి వంటి గ్లామర్ అట్రాక్షన్ ఉన్న హీరోయిన్ల మధ్య తన పాత్రకు పెద్ద వెయిట్ ఉండదని నయనతార అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్లామర్ నటి రీమాసేన్ పై మణి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రీమాసేన్ 'ఆయిరతిల్ ఒరువన్' అనే తమిళ చిత్రం షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘువన్ ను సుహాసిని మణిరత్నం సంప్రదించారనీ, కేవలం పది రోజుల షూటింగ్ కు రీమాసేన్ ను అనుమతించాలని రిక్వెస్ట్ చేశారనీ తెలుస్తోంది. అన్నీ సజావుగా జరిగితే నయనతార చేజార్చుకున్న అవకాశం రీమా ఒళ్లో వాలినట్టే.
News Posted: 8 August, 2009
|