http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shriya8.jpg' align='left' alt=''>శ్రియా శరణ్ ఇప్పుడు అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షిస్తోంది. కెరీర్ పరంగా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆమె ఎంతో ఆసగా ఎదురుచూస్తున్న 40 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం 'కందస్వామి' ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రింట్లతో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 34వ టోరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్ఎఫ్)లో రెడ్ కార్పెట్ వాక్ చేసే అవకాశం కూడా ఆమెకు దక్కింది. దీపా మెహతా దర్శకత్వంలో శ్రియ నటించిన 'కుకింగ్ విత్ స్టెల్లా' చిత్రం టిఐఎఫ్ఎఫ్ లో ప్రదర్శించబోతున్నారు. టోరెంటో ఫెస్టివల్ కు తన చిత్రం వెళ్తుండటం శ్రియను సంబరంలో ముంచెత్తుతోంది.
ఒక సినిమా విడుదలకు ముందే పలు చిత్రోత్సవాలకు ఎంపిక కావడం వల్ల ఆ సినిమాపై అంచనాలు ఎక్కువవుతాయనీ, వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుందని శ్రియ పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమా ప్రదర్శిస్తే ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తాయనీ, ఇండియన్ మార్కెట్ లో చాలా మంచి స్పందన కనిపిస్తుందనీ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు చిత్రాలతో పాటు 'కుకింగ్ విత్ స్టెల్లా' సినిమా కూడా టోరెంటో ఫెస్టివల్ కు ఎంపిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ గ్రేట్ ఈవెంట్ రోజున ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని శ్రియ అనుకుంటోందని ప్రశ్నించినప్పుడు 'ఫెస్టివల్ కు ఎప్పుడు బయలు దేరుతామనేది ఇంకా నిశ్చయించు కోలేదు. సెప్టెంబర్ 10న ఉత్సవం ప్రారంభమవుతుంది. 16వ తేదీన మా సినిమా ప్రదర్శితమవుతుంది. అందువల్ల మాకు కావాల్సినంత సమయం చిక్కుతుంది. నా మటుకు నేను సంప్రదాయ భారతీయ దుస్తులతోనే ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఎంతైనా నేను దేశీగాళ్ ను కదా...' అంటూ శ్రియ నవ్వుతూ చెప్పింది.