'కుర్బాన్'కు తాకిన స్వైన్ ఫ్లూ!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kurbaan.jpg' align='right' alt='Saif, Kareena'>'స్వైన్ ఫ్లూ' భయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. దీంతో జనం అప్రమత్తమవుతున్నారు. విపత్తు మీద పడినప్పుడు ఆలోచించడం కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంటుంది. ఇప్పుడు 'స్వైన్ ఫ్లూ' భయం బాలీవుడ్ ను కూడా తాకింది. 'కుర్బాన్' చిత్రం కోసం కరణ్ జోహర్ 180 మంది యూనిట్ సభ్యులతో పుణేలో రెండ్రోజుల పాట షూటింగ్ కు ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో 'స్వైన్ ఫ్లూ' ప్రమాదం గుర్తెరిగి పుణే షెడ్యూల్ ను కేన్సిల్ చేశారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు.
ఈనెల 8,9 తేదీల్లో జరగాల్సిన షూటింగ్ కోసం యూనిట్ లోని సగం మంది పుణే చేరుకున్నారనీ, కరీనా, సైఫ్ సైతం 7వ తేదీన అక్కడకు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రొడక్షన్ యూనిట్ షూటింగ్ కేన్సిల్ చేసిందనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. స్వైన్ ఫ్లూ కారణంగా జనం హోటళ్లు, ఎయిర్ పోర్ట్ లు, సినిమా హాల్స్ వంటి పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లేందుకు జంకుతున్నారనీ, దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రొడక్షన్ యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందనీ వారు తెలిపారు. కరీనాకపూర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తామంతా పుణే బయలుదేరానికి సిద్ధంగా ఉన్నామనీ, ఆ సమయంలో దర్శకుడు రెన్సిల్ డిసిల్వా, నిర్మాత కరణ్ జోహర్ ఫోను చేసి స్లైన్ ఫ్లూ బెడద కారణంగా పుణేకు వెళ్లబోవడం లేదని తెలిపారనీ ఆమె పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మళ్లీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేద్దామని కరణ్ చెప్పారనీ, యూనిట్ సభ్యుల పట్ల ఆయనకు ఉన్న కమిట్ మెంట్ మెచ్చుకుని తీరాలని ఆమె అన్నారు. పుణేలే మూడు సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉన్నందున సెప్టెంబర్ లో ఈ షెడ్యూల్ ఉండవచ్చని చెప్పారు. పెద్ద సంఖ్యలో యూనిట్ సభ్యులు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా షూటింగ్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం.డిసౌజా తెలిపారు. కొద్దిరోజుల తర్వాత అనుకున్న విధంగా పుణేలో షూటింగ్ జరుపుతామని అన్నారు.
News Posted: 10 August, 2009
|