బిగ్ బి...బిగ్ సెలబ్రేషన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/unforgetables.jpg' align='right' alt=''>బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు నవంబర్ 7వ తేదీ 'బిగ్ డే' కాబోతోంది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న అపురూప తరుణం ఇది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగుని రీతిలో ఈ సందర్భాన్ని జరిపేలా జయాబచ్చన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ కు బాలీవుడ్ ప్రముఖులంతా వెన్నుదన్నుగా నిలువనున్నారు. బాలీవుడ్ లో ఇంతవరకూ కనీవినీ ఎరుగుని రీతిలో ముంబైలో ఓ భారీ కన్సెర్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి బంటీ వాలియా ఈవెంట్ ఆర్గనైజర్ గా వ్యవహరించబోతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా తన నటనతో అలరింప చేస్తున్న మహానటుడు అమితాబ్ అనీ, అయితే కన్సెర్ట్ గురుంచి ఇప్పుడే పూర్తి వివారాలు చెప్పడం సాధ్యం కాదనీ బండీ వాలియా తెలిపారు. అయితే ఈ కన్సెర్ట్ కంటే ముందు అమితాబ్ అంటే ఎంతో ఇష్టపడే అనిల్ అంబానీ 'బచ్చన్ ఫిల్మ్ ఫెస్టవిల్'ను నిర్వహించబోతున్నారని తెలిపారు. కాగా, ఈ కన్సెర్ట్ లో పరిశ్రమలోని ప్రముఖులంతా పాల్గొని అమితాబ్ సినిమాల్లోని పాటలకు పెర్ ఫారమెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈవెంట్ చివర్లో మాత్రమే బచ్చన్ స్టేజ్ పైకి వస్తారు. అయితే ఆయన డాన్సులు చేసే అవకాశాలు అంతగా లేవనీ, అందుకు బదులుగా ఆయన తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రాసిన పొయిట్రీలోని కొన్ని కవితలు వినిపిస్తారనీ సమాచారం. ఆసక్తికరంగా అక్టోబర్ 11న అమితాబ్ 67వ పడిలోకి అడుగుపెడుతున్నారు.
News Posted: 10 August, 2009
|