అమ్మానాన్నలైన రాఖీ-ఎలేష్!
రాఖీ సావంత్, కెనడా బిజినెస్ మన్ ఎలేష్ పరుజన్ వాలా 'స్యయంవరం' జరిగి పట్టుమని వారంరోజులు కూడా కాకుండానే అమ్మానాన్నలు అయ్యారు. అదెలా సాధ్యమంటారా? 'రాఖీ కా స్వయంవరం' రియాల్టీ షో నిర్వహించిన ఎన్డీటీవీ ఇమాజన్ ఛానల్ లో మళ్లీ ఇప్పుడు 'పతి, పత్ని ఔర్ ఓ' అనే కొత్త షోను ప్రారంభించనుంది. అందులో అమ్మానాన్నలుగా రాఖీ, ఎలేష్ కలిసి నటించబోతున్నారు. రాఖీ-ఎలేష్ జంటతో పాటు మరో నాలుగు సెలబ్రిటీ జంటలు కూడా ఇందులో పాల్గొననున్నాయి.
రాఖీ ఇందులో ఎనిమిది నెలల గర్భవతిగా, పుట్టిన బిడ్డ టీనేజర్ అయ్యేంత వరకూ సాకే తల్లిగా నటించబోతోంది. 'బేబీ బారోవర్స్' అనే అంతర్జాతీయ రియాలిటీ షో స్ఫూర్తిగా ఈ షోని ఎన్డీటీవీ ఇమేజన్ రూపొందించనుంది. బీబీసి వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఇండియా ఈ షోను నిర్మించనుంది. ఈ షోలో పాల్గొనే పిల్లల అసలు తల్లిదండ్రులు తెరవెనుక నుంచి సెలబ్రెటీ దంపతులు తమ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో గమనించనున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాలు ప్రారంభించే వారికి ఈ షో మార్గదర్శకం అవుతుందని ఛానెల్ వర్గాలు చెబుతున్నాయి.
News Posted: 11 August, 2009
|