90 కోట్లకు చేరిన 'రావణ'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/ravana1.jpg' align='right' alt=''>ప్రముఖ దర్శకుడు మణిరత్నం హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న 'రావణ' చిత్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒకే సన్నివేశాన్ని రెండు సార్లు ఆర్టిస్టుల మార్పుతో చిత్రీకరించడం, అందులోనూ ఆయా భాషల నేటివిటీకి తగ్గట్టుగా ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే మణిరత్నం ఎక్కడా రాజీపడకుండా పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరిస్తూ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం అనుకున్న బడ్జెట్ పరిమితులను కూడా దాటి 90 కోట్ల ప్రాజెక్ట్ కాబోతోందని తెలుస్తోంది.
హిందీ, తమిళ భాషా చిత్రాల ఫ్లేవర్ భిన్నంగా ఉంటుందనీ, దీంతో రెండు భాషల్లోనూ లీడ్ క్యారెక్టర్లు పోషిస్తున్న అభిషేక్, విక్రమ్ ల నటనపై దర్శకుడు మణి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ ఆడియెన్స్ ఎలాగైతే ఇష్టపడతారో ఆ స్థాయిలో అభిషేక్ ఒక సన్నివేశంలో నటించగానే, దానిని తిరిగి విక్రమ్ పై తమిళ వెర్షన్ కోసం చిత్రీకరించడం జరుగుతోందనీ, తమిళ ఆడియెన్స్ విషయానికి వచ్చినప్పుడు ఆ సన్నివేశం మరింత ఉద్వేగంగా ఉండి నాటకీయత ఎక్కువగా కనిపిస్తుంటుదనీ వారు తెలిపారు. విక్రమ్ రెండు భాషల్లోనూ నటిస్తున్నందున వాయిస్ లో హెచ్చుతగ్గులపై ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, ఇది మిగతా ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుందనీ వారంటున్నారు. దీనికితోడు మణిపై బరువు బాధ్యతలు కూడా ఈసారి ఎక్కువైనట్టు వారు తెలిపారు. మణిరత్నం సినిమాల విషయంలో నిర్మాణ వ్యవహారాలు చూసుకునే ఆయన సోదరుడు జి.వెంకటేశ్వరన్ రెండేళ్ల క్రితం కన్నుమూయడం ఇందుకు ఓ కారణం. తొలిసారి సొంతంగా నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి రావడంతో మణిరత్నంపై అదనపు బాధ్యతల భారం పడిందనీ, ఇప్పుడు బడ్జెట్ కూడా పరిధులు దాటి 90 కోట్లకు చేరుకుందనీ వారు చెప్పారు. అయితే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం కొంతవరకూ ఊరట కలిగిస్తుండవచ్చని వారు పేర్కొన్నారు. ఈ రెండు వెర్షన్లలోనూ ప్రధాన భూమిక పోషిస్తున్న ఐశ్వర్యా రాయ్ సైతం మణిరత్నం 'రావణ్' చిత్రం ద్వారా మరోసారి స్క్రీన్ మ్యాజిక్ చేయడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గురు' చిత్రంతో అభిషేఖ్, తానూ కలిసి నటించినప్పటికీ ఇంతకు ముందెప్పుడే నటించని పాత్రలను 'రావణ్'లో తామిద్దరూ పోషిస్తున్నామనీ, మణిరత్నం చిత్రంలో నటించాలనే డ్రీమ్ ప్రతి ఆర్టిస్టుకు ఉంటుందనే, అదే ఆయన గొప్పతనమనీ ఐశ్వర్య ఎంతో సంబరంగా చెప్పుకొచ్చింది.
News Posted: 11 August, 2009
|