కృష్ణాష్టమి వేడుకల్లో కశ్మీరా
బాలీవుడ్ హాట్ గాళ్ కశ్మీరా షా ముంబై వీధుల్లో జరిగే కృష్ణాష్టమి వేడుకల్లో షడన్ గా కనిపించి భక్తులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తబోతోంది. ఇంతవరకూ అయితే విశేషం లేకపోవచ్చు కానీ...కృష్ణాష్ణమి వేడుకలు ఘనంగా జరిగే ఒకటి రెండు మండళ్లలో 'దహీ హండీ'ని (ఉట్టి) పగులగొట్టబోతోంది. 'ఈ ఏడాది కనీసం ఒక ఉట్టినైనా పగులగొడతాను. ఆ విషయం తలుచుకుంటేనే చాలా ఎగ్జయింటింగ్ ఉంది' అంటూ తన సంబరాన్ని అందరితో పంచుకుంటోంది కశ్మీరా షా. ఆమె లవర్ పేరు కూడా కృష్ణనే కావడంతో ఆ ఆనందం ఇప్పుడు ద్విగుణీకృతమవుతోంది.
కశ్మీరా ఆ ముచ్చట్లు చెబుతూ 'కృష్ణాష్టమికి దహీ హండీ పగులగొట్టాలంటూ గతవారంలో ఉత్సవ మండపాల నిర్వాహకులు నన్ను సంప్రదించారు. ఆ పని ఎందుకు చేయకూడదని అప్పటికప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అందులోనూ అమ్మ మహారాష్ట్రలో పుట్టిపెరిగింది. నేను గిరిగావ్ లో పెరిగాను. గతంలో కూడా గణపతి ఉత్సవాల్లో రోడ్లమీద డాన్సులు చేశాను. నాకున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పలు మండళ్ల నిర్వాహకులు నన్ను అప్రోచ్ అయ్యారు. వాటిలో గిర్ గావ్, లాల్ బాగ్, ఘట్నోపర్, థానె వంటివి కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎంచుకుంటాను. బహుశా ఇంతవరకూ ఏ నటి కూడా ఇలాంటి ఫీట్ చేయలేదన్న ఆలోచనే నన్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది' అంది. ఉట్టి పగులగొట్టడం ఆషామాషీ వ్యవహారంగా కూడా కాశ్మీరా షా తీసుకోవడం లేదు. ఇందుకోసం నిపుణులైన కొందరి దగ్గర మెళకువలు నేర్చుకున్నాననీ, రిహార్సల్స్ కూడా చేశాననీ చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా కృష్ణ కావడంతో తన సంబరం రెట్టింపయిందని అంగీకరించింది. 'నేను ఉట్టికొడుతున్న విషయం కృష్ణకు మొదట్లో తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిసి నాకు దెబ్బలు తగులుతాయోమేనని తల్లడిల్లిపోతున్నాడు' అంటూ కశ్మీరా నవ్వుతూ చెప్పింది.
News Posted: 13 August, 2009
|