http://www.telugupeople.com/uploads/tphome/images/2009/rambha21.jpg' align='right' alt=''>టీవీ ఛానెల్స్ వివాహ వేదికలు మారుతూ 'కల్యాణాలు' జరిపిస్తున్న సీజన్ ఇది. ఎన్టీటీవీ ఇమాజిన్ లో 'రాఖీ కా స్వయంవరం' షో ద్వారా రాఖీ సావంత్ కెనడా బిజినెస్ మన్ ఎలేజ్ పరుజన్ వాలా చేయందుకుంది. ఈ 'స్యయంవరం' షో అనూహ్యంగా ఆ ఛానెల్ టిఆర్ పి రేటింగ్ ను కూడా పెంచేసింది. ఇప్పుడు రాఖీ బాటలోనే పలువురు గ్లామర్ ముద్దుగుమ్మలు 'స్వయంవరం' కోసం క్యూలు కట్టబోతున్నారు. దక్షణాదిని కొద్దికాలం క్రితం వరకూ ఓ ఊపుఊపిన సోయగాల సుందరి రంభ సైతం ఓ ప్రముఖ తమిళ ఛానెల్ ద్వారా తన స్వయంవరానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. రంభకు తగిన వరుడి కోసం గత మూడేళ్లుగా ఆమె కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. నచ్చిన వరుడిని 'స్వయంవరం' ద్వారా ఎంచుకుంటే ఎలా ఉంటుందనే రంభ ఆలోచనకు ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా ప్రోత్సహం లభించిందని సమాచారం.
ముక్కూ ముఖం తెలియని వ్యక్తి కంటే తనంటే పడిచచ్చే వరుడ్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని రంభ భావిస్తోందట. ఈ దిశగా ఇప్పటికే ఓ ఛానల్ తో 'స్యయవంరం' షో కోసం రంభ సంప్రదింపులు జరుగుపుతోందని తెలుస్తోంది. ఈ షో కార్యరూపంలోకి వస్తే రంభకు నచ్చిన వరుడు దొరకడంతో పాటు షో ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తం రంభకు పారితోషికంగా కూడా లభిస్తుందట. రంభ పిలిస్తే పొలోమంటూ పెళ్లికొడుకులు క్యూలు కట్టేయడం ఖాయమని చెన్నై వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి.