మలక్కాలో షారూక్ స్టూడియో
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/datuk.jpg' align='left' alt=''>బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఇప్పుడు మలేసియాలో సొంత స్టూడియో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మలేసియన్ ప్రావిన్స్ మలక్కాలో ఈ స్టూడియో ఏర్పాటు కానుందనీ, అక్కడి ప్రభుత్వ సహకారంతో షారూఖ్ ఏర్పాటు చేసే స్టూడియోలో రెండు ఫ్లోర్ లు, ఒక ఫిల్మ్ ల్యాబ్ కూడా ఉండబోతోందనీ ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. మలేసియా ప్రభుత్వం గత ఏడాది బ్రిటిష్ నైట్ వుడ్ తో సమానమైన ప్రతిష్ఠాత్మక 'డటుక్' పురస్కారంతో షారూక్ ను సన్మానించింది.
'మలక్కా ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ రుస్తుంకు షారూక్ మంచి మిత్రుడు. గత సోమవారం మన్నత్ నివాసంలో ఇచ్చిన విందులో షారూక్ పాల్గొన్నారు. స్టూడియో ప్లాన్ పై ఇద్దరూ ముచ్చటించుకున్నారు. దేశంలో మరిన్ని బాలీవుడ్ చిత్రాల షూటింగ్ కు మలేసియా ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. అందుకు అవసరమైన అన్ని వసతులను ఈ స్టూడియో అందుబాటులో ఉంచుతుంది. మలిసియా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది' అని షారూక్ సన్నిహితుడు తెలిపారు. మలేసియా సినీ పరిశ్రమకూ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కూ చాలాకాలంగా మంచి అనుబంధం ఉంది. బెన గళ్ 'ఫని మజుందార్'తో సహా పలు సినిమాలను ఇండియన్ డైరెక్టర్లు మలేసియాలో తీశారు. ఇప్పుడు షారూక్ తో చిరకాల అసోసియేషన్ ను మలేసియన్లు కోరుకుంటున్నారనీ, గత ఏడాది డిసెంబర్ లో 'డటుక్' అవార్డు అందుకునేందుకు షారూక్ వచ్చినప్పుడే స్టూడియో ఏర్పాటు పై తొలి చర్చలు జరిగాయనీ ఆయన తెలిపారు. షారూక్ కు అక్కడి ఇండియన్ జాతీయులు, మలై ముస్లింలలో మంచి పాపులారిటీ కూడా ఉంది. ఆయన నటించిన 'వన్ 2 కా 4', 'డాన్' చిత్రాల షూటింగ్ ఎక్కువభాగం ఇక్కడే జరిగింది. షారూక్ తన తదుపరి చిత్రమైన 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ సైతం మలేసియాలో జరిపేందుకు రుస్తుంకు హామీ ఇచ్చారు.
News Posted: 14 August, 2009
|