ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/aishwarya_rai3.jpg' align='right' alt=''>ముంబై: బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ 'ఛాతీ ఇన్ఫెక్షన్', 'ఫ్యూ లక్షణాలు'తో బాధపడుతుండటం ఆమె మామ అమితాబ్ బచ్చన్ ను కలవర పరుస్తోంది. భర్త అభిషేక్ తో కలిసి ప్రస్తుతం ఊటీలో జరుగుతున్న మణిరత్నం 'రావణ' షూటింగ్ లో ఐశ్వర్య పాల్గొంటున్నారు. అమితాబ్ బచ్చన్ తన మిత్రుడు, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్ చికిత్స కోసం సింగపూర్ లో ఉన్నారు. ఐశ్వర్య కు 'స్వైన్ ఫ్లూ' లక్షణాలు కనిపించడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చినట్టు అమితాబ్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.
'ఐశ్వర్య కు ఆరోగ్యం సరిగా లేదు. ఛాతీ ఇన్ఫెక్షన్ తో పాటు ఫ్లూ లక్షణాలతో బాధపడుతోంది. నిన్న తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. ఈరోజు కొంచెం తగ్గింది' అని అమితాబ్ చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటంతో వారి ఆరోగ్యం గురించి బెంగగా ఉందనీ, వారు బాధ్యత తెలిసిన వ్యక్తులు, పెళ్లయిన వాళ్లూ అయినప్పటికీ తమ దృష్టలో వారెప్పటికీ చిన్న పిల్లలేననీ ఆయన వ్యాఖ్యానించారు. తాను సైతం నడుంనొప్పితో బాధపడుతున్నట్టు తెలిపారు. అమర్ సింగ్ శస్త్రచికిత్స కోసం సుమారు నెలరోజులు పాటు సింగపూర్ లోనే ఉన్న జయ తిరిగి ముంబై వెళ్లిపోయిందనీ, అమర్ కు పూర్తిగా నయమయ్యేంతవరకూ తాను సింగపూర్ లోనే ఉంటాననీ అమితాబ్ తెలిపారు.
News Posted: 17 August, 2009
|