కరీనా-సైఫ్ ఏకాంతవాసం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/saif-kareena4.jpg' align='left' alt=''>సైఫ్ అలీఖాన్ కు ఈ పుట్టినరోజున అరుదైన గిఫ్ట్ కరీనా రూపంలో లభించింది. కరీనా బిజీ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చికాగో సమీపంలోని ఓ అజ్ఞాత ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. అంతకు ముందు ఈ ఇద్దరూ వృత్తిపరమైన కమిట్ మెంట్లు పూర్తి చేసుకున్నారు. తొలుత సన్నిహిత మిత్రులకు కొంత సమయం వెచ్చించారు. చికాగోలోనే ఉన్న షారూక్ ఖాన్, కత్రినాకైఫ్ లతో కలిసి డిన్నర్ లో పాల్గొన్నారు.
సైఫ్, కరీనా ప్రతిసారీ తమ పుట్టినరోజున ఒకరికోసం మరొకరు తమ విలువైన సమయాన్ని కేటాయిస్తుంటారనీ, ఈసారి హూస్టన్ లో ఇండిపెండెన్స్ డే ఈవెంట్ లో పాల్గొన్నారనీ, చికాగో ఈవెంట్ కు కూడా హాజరయ్యారనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న చికాగో లో షారూక్, కత్రినా పాల్గొంటున్న ఈవెంట్ కు కూడా వీరు హాజరయ్యారని పేర్కొన్నారు. సైఫ్ తన బర్త్ డే జరుపుకొన్న మరుసటి రోజే కరీనాతో కలిసి చికాగో సమీపంలోని ఓ అజ్ఞాత ప్రాంతానికి తరలి వెళ్లారని వారు తెలిపారు. కరీనా నాలుగు రోజుల పాటు హాలిడేను ప్లాన్ చేసి సైఫ్ ను ఆశ్చర్యంలో ముంచెత్తిందనీ, వారు ఎక్కడికి వెళ్లారో తెలియనప్పటికీ వారాంతంలోనే తిరిగి ముంబై చేరుకుంటారని వారు వెల్లడించారు.
News Posted: 17 August, 2009
|