కమల్ తనయ కొరియోగ్రఫీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/akshara-haasan.jpg' align='left' alt='Akshara hasan'>విలక్షణ నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా బహుముఖ ప్రతిభను సొంతం చేసుకున్న పద్మశ్రీ కమల్ హాసన్ బాటలోనే ఇప్పుడు ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్ పయనిస్తున్నారు. శ్రుతి హాసన్ ఇప్పటికే హిందీ 'లక్' తో నటిగా అరంగేట్రం చేసింది. పలు మ్యూజిక్ అల్బమ్స్ చేస్తూ సంగీతం పట్ల మంచి పట్టు ప్రదర్శిస్తోంది. మ్యూజికల్ ట్రూప్ ఏర్పాటు చేసి పలు ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. కమల్ కథానాయకుడుగా ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న 'ఉన్నైపోల్ ఒరువన్' (తెలుగులో 'ఈనాడు') చిత్రం ద్వారా తొలిసారి సంగీత దర్శకురాలిగా కూడా ఆమె పరిచయమవుతున్నారు. ఇప్పుడు అదే చిత్రం ద్వారా కమల్ రెండో కుమార్తె అక్షర హాసన్ కూడా అరంగేట్రం చేస్తోంది. కాకపోతే తండ్రి, సోదరికి భిన్నంగా కొరియాగ్రాఫర్ గా పరిచయమవుతోంది.
'ఉన్నైపోల్ ఒరువన్' చిత్రంలోని 'వానమ్ ఎల్లై ఇళ్లై ' అనే పాటకు అక్షర కొరియోగ్రఫీ అందించనున్నారు. టెర్రరిజం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని కీలకమైన పాట ఇదనీ, తొలిసారిగా అక్షర కొరియోగ్రాఫర్ గా మెగాఫోన్ పట్టుకోనుందనీ తెలుస్తోంది. కమల్ హాసన్ నటనను సీరియస్ గా తీసుకుంటే ఆమె కుమార్తెలు తమ ప్రతిభను ఇతర విభాగాల్లోనూ చాటుకోవాలనుకోవడం ఆయన అభిమానులను సంబరంలో ముంచెత్తుతోంది. హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా 'ఉన్నైపోల్ ఒరువన్' రూపొందుతోంది. యూటీవీ, రాజ్ కమల్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు.
News Posted: 24 August, 2009
|