'రోడీస్'లో ఇర్ఫాన్ ఖాన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/irfankhan.jpg' align='left' alt='Irfankhan'>హిందీలో విలక్షణ నటుడుగా పేరున్న ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడు ఎంటీవీ రోడీస్ లో అడుగుపెడుతున్నారు. అయితే జడ్జిగానో, కంటెస్టంట్ గానో కాదు. దేశవ్యాప్తంగా ఉల్లాసంగా ట్రావెలింగ్ చేస్తూ కనిపిస్తారు. తొలినాళ్లలో టెలివిజన్ సీరియల్స్ తో పాపులర్ అయిన ఇర్ఫాన్ ఆ తర్వాత క్రమంగా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంత కాలానికి మళ్లీ ఆయన బుల్లితెర వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈసారి సీరియల్ లో కాకుండా ఎంటీవీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన ట్రావెల్ ఆధారిత రియాల్టీ షో 'రోడీస్' కోసం పనిచేయబోతుండటం విశేషం. టెలివిజన్ లో ఎప్పుడూ తాను ఫిక్షన్ తరహా పాత్రలు పోషించలేదనీ, ఈసారి మాత్రం ఈ షోలో తాను చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాననీ ఇర్ఫాన్ చెబుతున్నారు.
'రోడీస్' నెక్స్ట్ సీజన్ రియాల్టీ షో లో పాలుపంచుకోవడం పట్ల ఇర్ఫాన్ సంతోషం వ్యక్తం చేస్తూ 'చాలాకాలంగా ఇలాంటి ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాను. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను పర్యటించే అవకాశాన్ని బాగా ఎంజాయ్ చేయబోతున్నాను' అని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే వివిధ ప్రాంతాలను పర్యటించేందుకు ఇర్ఫాన్ ఆసక్తిగా ఉన్నారు. బయట నుంచే స్పెషల్ కామెంటేటర్ గా తాను కనిపిస్తాననీ, అయితే ఇందులో ఇతమిద్ధంగా తన పాత్ర ఏమిటనేది 'రోడీస్' ప్రోగ్రాం చూసే తెలుసుకోవాలనీ ఇర్ఫాన్ నవ్వుతూ చెప్పారు.
News Posted: 24 August, 2009
|