గ్లామర్ అమ్మగా జీనత్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/zeenat-aman.jpg' align='left' alt=''>బాలీవుడ్ రీల్ ఒక్కసారిగా వెనక్కి తిప్పితే ఒకప్పుడు తన అందచందాలతో యువతను ఉర్రూతలూగించిన జీనత్ అమన్ కళ్లముందు మొదులుతుంది. ఆమె పేరు చెప్పగానే గిటార్ చేతిలో తీసుకుని 'చురాలియా హై తుమ్నే జో దిల్ కో' అంటూ ఆమె సృష్టించిన మెరుపులు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. 'యాదోం కి బారాత్' సినిమా మళ్లీ చూస్తే బాగుండునని అనిపిస్తుంది. దర్శకుడు సంజయ్ శర్మ ఇప్పుడు ఆ కోరిక తీర్చబోతున్నారు. గిటార్ తో స్టన్నింగ్ జీనత్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'డునో వై..న జానే క్యోం' చిత్రం కోసం మళ్లీ జీనత్ ను ఆయన వెండితెరకు తీసుకు వస్తున్నారు. అయితే ఈసారి ఆమె అందాల తల్లి పాత్రలో కనిపించనుంది.
'ఆర్.డి. బర్మన్ కంపోజ్ చేసిన చురా లియా...పాటలో గిటార్ తో కనిపించిన జీనత్ అమన్ సిగ్నేచర్ లుక్ ప్రపంచ ప్రేక్షకులందిరీ సుపరిచతం' అని తాజా చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్న కపిల్ శర్మ తెలిపారు. ఈ చిత్రంలో పాశ్చాత్య పోకడలతో కనిపించే కీలక మైన పాత్రకు జీనత్ అయితేనే బాగుంటుందని సోదరుడు సంజయ్ ను కపిల్ నచ్చజెప్పి ఒప్పించారు. అంతేకాదు. స్టైలిష్ట్ రెహాన్ షా, ఫోటోగ్రాఫర్ విక్కీ ఇద్నానితో కలిసి జీనత్ స్టైలింగ్ కు కపిల్ తుదిరూపం ఇవ్వబోతున్నారు. ఈ పాత్ర కోసం జీనత్ కఠినమైన ఎక్స్ ర్ సైజ్ లతో కొంత బరువును కూడా తగ్గించుకుంటున్నారు. పాత్ర పరంగా జీనత్ అమన్ భర్త 20 ఏళ్ల క్రితమే కనిపించకుండా ఎటో వెళ్లిపోతాడు. దీంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత జీనత్ పై పడుతుంది. జీనత్ భర్తగా ఓ నీనియర్ యాక్టర్ ని ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. జీనత్ గతంలో ఇంతవరకూ గ్లామర్ మామ్ పాత్ర పోషించలేదనీ, దీంతో మొదట్లో కొంత సంకోచం వ్యక్తం చేసిందనీ దర్శకుడు సంజయ్ శర్మ తెలిపారు. జీనత్, ఆమె ఇద్దరు పిల్లలు, కోడలు చుట్టూ తిరిగే కథ ఇదని చెప్పారు. ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని జీనత్ ధ్రువీకరించింది. అయితే ఇప్పుడే ఆ వివరాలు చెప్పలేనని ఆమె స్పష్టం చేశారు. ముంబై, గోవాలలో ఈ చిత్రం షూటింగ్ జరుగనుంది. రితుపర్ణ సేన్ గుప్తా, హెలెన్, కొత్తనటులు మేఘ (మౌసమి ఛటర్జీ కూతురు), యువరాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు.
News Posted: 24 August, 2009
|