'బ్లూ' ఫిలింలో కత్రినా గెస్ట్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/katrina7.jpg' align='right' alt=''>అండర్ వాటర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'బ్లూ' చిత్రంలో నటించేందుకు కత్రినా కైఫ్ మొదట్లో భయపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ చిత్రం ట్రైలర్స్, టెలివిజన్ టీజర్స్ లో కత్రినా హైలైట్ కానుంది. అయితే ఇందులో తాను కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించే గెస్ట్ రోల్ పోషించినట్టు కత్రినా వివరణ ఇచ్చింది. అండర్ వాటర్ కేపర్ గా సూపర్ రోల్ పోషిస్తున్న అక్షయ్ కుమార్ కోరిక మేరకే తాను ఈ చిత్రంలో నటించినట్టు వెల్లడించింది. నటించినది చిన్న పాత్రే అయినా భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన విషయాన్ని కూడా ఆమె అంగీకరించారు.
'ఇందులో కేవలం ఎనిమిది నిమిషాల నిడివి ఉండే పాత్రను పోషించాను. హోర్డింగ్ లు, పబ్లిసిటీలో కనిపించను. దర్శకుడు టోనీ డి సౌజా ప్రతిభావంతుడు మాత్రమే కాదు. చాలా సహృదయుడు కూడా. నా క్యారెక్టర్ ఎలా ఉండాలనే విషయంలో సంప్రదింపులు కూడా జరిపారు' అని కత్రినా చెప్పుకొచ్చింది. ఇందులో కత్రినా కింది పెదవికి ఒక రింగ్ కూడా కనిపిస్తుంది. ఇది కేవలం పెట్టుడు రింగ్ మాత్రమేననీ, మ్యాగ్నటిక్ రింగ్ అనీ తెలిపింది. ఇందువల్ల తన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. కత్రినా ఇందులో అతిథి పాత్ర పోషించిందనీ, ఆమె పాత్రపై తమకు స్పష్టమైన అవగాహన ఉందనీ, ఆమె పేరును పబ్లిసిటీకి దూరంగా కూడా ఉంచబోతున్నామనీ టోనీ డిసౌజా తెలిపారు.
News Posted: 24 August, 2009
|