గణేష్ నిమజ్జనంలో సల్మాన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman-ganesh.jpg' align='left' alt=''>ముంబై: దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవ సంబరం అంబరాన్ని అంటింది. ముంబైలో తొలిరోజు గణేష నిమజ్జనం భక్తుల 'గణపతి బొప్పా మోరియా' నినాదాలతో హోరెక్కింది. ఇళ్లలో పూజాకాదికాలు అందుకున్న వేలాది గణపణి విగ్రహాలను మంగళవారంనాడు గిరిగావ్ చౌపట్టీ, జూహూ, మార్వె, గోరియా, దాదర్ ప్రాంతాల్లోని బీచ్ లు, సరస్సులలో నిమిజ్జనం చేయడంతో భక్తులు కిటకిటలాడారు. వేలాది మంది భక్తులతో పాటు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖన్. గోవిందా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతకముందు సల్మాన్ సైతం సబర్బన్ బాంద్రాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన గణేష విగ్రహానికి భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు. సల్మాన్ తో పాటు ఆయన తల్లి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే, క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి కత్రినా కైఫ్ సైతం సల్మాన్ నివాసాన్ని సందర్శించి గణపతి పూజలో పాల్గొన్నారు.
గణపతి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వినాయక మండళ్లు, బీచ్ ల వద్ద 40,000 మంది నగరపాలక సంస్థ ఉద్యోగులను, లైఫ్ గార్డ్ లను మోహరించారు. మోట్రోపాలిస్ చుట్టూ ఉన్న ప్రధాన నిమిజ్జన కేంద్రాల్లో అత్యవసర సామాగ్రితో కూడిన సుమారు 44 మోటార్ బోట్స్, 12 ఫైర్ బ్రిగేడ్ బోట్స్ ఏర్పాటు చేశారు. మెట్రోపోలీస్ లో తీవ్రవాదుల ప్రభావం ఉండవచ్చనే హెచ్చరికలు, స్వైన్ ఫ్లూ బెడదను కూడా లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున గణేష్ ఉత్సావాలను భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు. పరేల్ లోని ప్రఖ్యాత 'లాల్ బాగ్జా రాజా' మండపంతో పాటు ఇతర గణేష మండపాల్లో భక్తులు వర్షాలను కూడా లెక్కచేయకుండా క్యూలు కట్టి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
News Posted: 25 August, 2009
|