కత్రినకు రాజీవ్ అవార్డు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shahid-katrina1.jpg' align='right' alt='Shahid, Katrina'>ముంబై: వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఇచ్చే రాజీవ్ గాంధీ జాతీయ అవార్డులను బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు సాహిద్ కపూర్ అందుకున్నారు. రాజీవ్ గాంధీ 12వ స్మారక అవార్డుల కార్యక్రమాన్ని ముంబైలోని నేషనల్ సెంటర్ లో రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య ఈనెల 19న కన్నులపండువగా నిర్వహించారు. రాజీవ్ బర్త్ డేను పురస్కరించుకుని జరిపిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించారు. కమల్ నాథ్, విలాసరావు దేశ్ ముఖ్, అశోక్ చవాన్, ముళీ దేవర, జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మకెన్, రాజీవ్ శుక్లా, ప్రియాదత్, మిలంద్ డియోర, ఏకనాథ్ గైక్వాడ్, సంజయ్ నిరుపమ్, మహమ్మద్ అజారుద్దీన్, సుబోధ్ కాంత్ సహాయ్, గురుదాస్ కామత్, మాణిక్ రావ్ ఠాక్రే వంటి రాజకీయ ప్రముఖులతో పాటు, హృతిక్ రోషన్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, ఇషా డియోల్, ప్రియాంక చోప్రా, రాజు శ్రీవాత్సవ్, విశాల్ శేఖర్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దేశ ప్రియమత నాయకుడైన రాజీవ్ స్మృత్యర్థం 1995లో శ్రీ చరణ్ సింగ్ సప్రా (అవార్డ్స్ కన్వీనర్) రాజీవ్ గాంధీ అవార్డులను ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ అవార్టుల కమిటీ (ట్రస్ట్) ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
ఈ ఏడాది రాజీవ్ గాంధీ జాతీయ అవార్డుల విజేతలలో ఉత్తమ నటుడుగా సాహద్ కపూర్, ఉత్తమ నటిగా కత్రినా కైఫ్ అవార్డులు అందుకున్నారు. ఇతర విజేతల్లో వినీత్ జైన్ (పారిశ్రామిక వేత్త), రమేష్ చంద్ర అగర్వాల్ (జర్నలిజం), శామ్ పిట్రోడా (గ్లోబల్ ఇండియన్), డాక్టర్ నరేంద్ర జాదవ్ (విద్యావేత్త), డాక్టర్ జి.మాధవన్ నాయర్ (సూపర్ అచీవర్), కృష్ణా పాటిల్ (మహిళా అచీవర్), అవికా గోర్ (బాల మేథావి), రాజశ్రీ బిర్లా (సామాజిక రంగం), రోహిత్ కోచర్ (ఔత్సాహిక పారిశ్రామికవేత్త), ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా (స్పోర్ట్స్) ఉన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 8 గంటలకు సోనీ టీవీలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు.
News Posted: 25 August, 2009
|